Issuing orders
-
బుల్డోజర్లకు బ్రేక్
న్యూఢిల్లీ: కొన్ని రాష్ట్రాల్లో అమలవుతున్న బుల్డోజర్ న్యాయానికి సుప్రీంకోర్టు చెక్ పెట్టింది. సుప్రీంకోర్టు అనుమతి లేకుండా దేశవ్యాప్తంగా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దని ఆదేశాలు జారీచేసింది. తదుపరి విచారణ జరిగే అక్టోబర్ ఒకటో తేదీదాకా నిందితులతో సహా ఎవరి ఇళ్లనూ కూల్చవద్దని ఆదేశించింది. అయితే రోడ్లు, ఫుట్‌పాత్‌లు, రైల్వే స్థలాలు, తదితర ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలను నిరభ్యంతరంగా తొలగించవచ్చని తెలిపింది. తమ ఆదేశాలు ప్రభుత్వ స్థలాల్లోని అక్రమ నిర్మాణాలకు వర్తించవని జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కె.వి.విశ్వనాథన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టత ఇచి్చంది. చట్టవిరుద్ధంగా ఒక్క కూలి్చవేత చోటుచేసుకున్నా.. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని వ్యాఖ్యానించింది. తమ అనుమతి లేకుండా ఎలాంటి కూలి్చవేతలు చేపట్టవద్దనే ధర్మాసనం ఆదేశాలపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టబద్ధ సంస్థల చేతులను ఇలా కట్టేయలేరని అన్నారు. అయినా ధర్మాసనం తమ ఆదేశాలపై వెనక్కి తగ్గలేదు. కూల్చివేతలు రెండు వారాలు ఆపితే ముంచుకొచ్చే ప్రమాదమేమీ లేదని వ్యాఖ్యానించింది. 15 రోజుల్లో ఏమీ జరిగిపోదని పేర్కొంది. కార్యనిర్వాహక వర్గం న్యాయమూర్తి పాత్ర పోషించలేదని స్పష్టం చేసింది. దేశవ్యాప్తంగా అధికారవర్గాలను కూలి్చవేతలు ఆపివేయమని తాను కోరలేనని తుషార్ మెహతా నివేదించగా.. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 142 కింద సంక్రమించిన ప్రత్యేక అధికారాల మేరకు.. కూలి్చవేతలు నిలిపివేయమని ఆదేశాలు జారీచేశామని తెలిపింది. పలు రాష్ట్రాల్లో క్రిమినల్ కేసుల్లో నిందితులుగా ఉన్న వారి ఇళ్లను, ఇతర నిర్మాణాలను కూలి్చవేస్తున్నారని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు మంగళవారం విచారించింది. కూలి్చవేతలపై తప్పుడు అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అన్నారు. ‘తాను ఒక నిర్దిష్ట మతానికి చెందినందువల్లే తన నిర్మాణాలను కూలి్చవేశారని ఒకరు పిటిషన్ వేశారు. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూల్చివేతకు దిగిన ఒక్క సంఘటనను ధర్మాసనం దృష్టికి తెమ్మనండి. ప్రభావిత పక్షాలేవీ కోర్టును ఆశ్రయించలేదు. ఎందుకంటే తమకు నోటీసులు అందాయని, తమవి అక్రమ కట్టడాలని వారికి తెలుసు’ అని తుషార్ మెహతా వాదించారు. బుల్డోజర్లు ఆగవని ఎలా అంటారు? సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా కూలి్చవేతలను నిలిపివేయాలని, ఈ అంశంలో మార్గదర్శకాలు జారీచేస్తామని సుప్రీంకోర్టు చెప్పినా.. కొందరు ధిక్కార ప్రకటనలు చేయడం పట్ల జస్టిస్ గవాయి, జస్టిస్ విశ్వనాథన్‌ల ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘అయినా బుల్డోజర్లు ఆగవని, స్టీరింగ్ ఎవరి చేతుల్లో ఉందనే దాన్ని బట్టే ఇది నిర్ణయమవుతుందని ప్రకటనలు చేశారు. వీటిపై ఇంతకంటే ఎక్కువగా మాట్లాడకుండా సంయమనం పాటిస్తున్నాం. కూలి్చవేతలపై మార్గదర్శకాలు రూపుదిద్దుకున్నాక.. బుల్డోజర్ల సంస్కృతిని గొప్పగా, ఘనతగా చెప్పుకోవడాన్ని ఎలా నిరోధించాలనే విషయంలో మీరు మాకు సహాయపడండి’ అని తుషార్ మెహతాకు సూచించింది. నిందితుడు అయినంత మాత్రాన ఇళ్లు కూల్చేస్తారా? ఒకవేళ అతను దోషిగా తేలినా సరే.. చట్టపరమైన ప్రక్రియను పాటించకుండా కూలి్చవేతలకు దిగలేరు. ఇదెక్కడి బుల్డోజర్ న్యాయమని సెపె్టంబర్ 2న విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
ప్రజల నమ్మకాన్ని చెత్త బుట్టలో పడేశారు
న్యూఢిల్లీ: దేశంలో ప్రఖ్యాతిగాంచిన జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడవి మధ్యలో టైగర్ సఫారీల ఏర్పాటును సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. వాటి కార్యకలాపాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సఫారీల ఏర్పాటు కోసం అక్రమ నిర్మాణాలు చేపట్టడంతోపాటు అక్కడి భారీ వృక్షాలను నరికివేయడంపై మండిపడింది. అక్రమ నిర్మాణాలు, చెట్ల నరికివేతకు అనువుగా నిబంధనలను తుంగలో తొక్కిన 2021లో బీజేపీ ప్రభుత్వహయాంలో నాటి ఉత్తరాఖండ్ అటవీ మంత్రి హరక్ సింగ్ రావత్, నాటి డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ కిషన్ చంద్ల పనితీరును తీవ్రంగా ఆక్షేపించింది. ‘‘ ప్రజా విశ్వాసాన్ని బుట్టదాఖలుచేశారు. ఇంతటి విపరీత నిర్ణయాలు కేవలం ఇద్దరే తీసుకున్నారని అనుకోవట్లేము. ఇందులో చాలా మంది ప్రమేయం ఉండొచ్చు’’ అని జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని పీకే మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాల సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. జాతీయవనంలోని ల్యాన్డౌన్ ఫారెస్ట్ డివిజన్లో పఖ్రో టైగర్ సఫారీ కోసం వేల చెట్లు నరికేశారంటూ పర్యావరణవేత్త, న్యాయవాది గౌరవ్ భన్సల్ వేసిన పిటిషన్‌ను బుధవారం సుప్రీంకోర్టు విచారించింది. ‘‘ అధికారి కిషన్‌ను సస్పెండ్ చేయాలని అటవీ కార్యదర్శి చేసిన సిఫార్సును రావత్ పెడచెవిన పెట్టారు. పైగా కిషన్‌ను సమరి్ధంచారు. రావత్ ఆ పదవి నుంచి దిగిపోయాయే కిషన్ సస్ఫెన్షన్, అరెస్ట్ చేశారు. ఈ ఘటన రాజకీయనేతలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగులు కలిసి చేస్తున్న అక్రమాలకు ప్రబల సాక్ష్యం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. ‘‘ ఈ ఉదంతంపై సీబీఐ ఇప్పటికే దర్యాప్తు జరుపుతోంది. ఈ ఘటనపై సీబీఐ సమగ్ర నివేదిక మూడు నెలల్లో సమరి్పంచాలి. తర్వాతే తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని కోర్టు వ్యాఖ్యానించింది. జిమ్ కార్బైట్ నేషనల్ పార్క్ రాయల్ బెంగాల్ పులులకు ఆవాసం. 1,288.31 చదరపు కి.మీ.లోని ఈ అటవీప్రాంతం పేరు. అత్యంత ఎక్కువ సంఖ్యలో పులులు సంచరించే ప్రాంతంగా ప్రపంచ ప్రసిద్దిగాంచింది. -
రూ.20 లక్షలు డిపాజిట్ చేస్తే పాన్/ఆధార్
న్యూఢిల్లీ: కరెంటు ఖాతా తెరవడానికి, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్లు, ఉపసంహరణలకు పాన్/ఆధార్ నంబర్ ఇవ్వడడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20లక్షలకు మించి డిపాజిట్ చేసినా, ఉపసంహరించుకున్నా బ్యాంకుకు పాన్ లేదా ఆధార్ ఏదో ఒకటి సమర్పించాలి. అలాగే, బ్యాంకు, పోస్టాఫీసులో కరెంటు ఖాతా లేదా క్యాష్ క్రెడిట్ ఖాతా తెరవాలన్నా వీటిని తప్పనిసరి చేస్తూ ఆదాయపన్ను శాఖకు చెందిన ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) నోటిఫికేషన్ జారీ చేసింది. దీనివల్ల లావాదేవీల్లో మరింత పారదర్శకత వస్తుందని ఏకేఎం గ్లోబల్ ట్యాక్స్ పార్ట్నర్ సందీప్ సెహగల్ అన్నారు. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోఆపరేటివ్ సొసైటీలు రూ.20 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీలను ఆదాయపన్ను శాఖకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందన్నారు. ‘‘డిపాజిట్లు, ఉపసంహరణకు పాన్‌ను తీసుకోవడం అంటే వ్యవస్థలో నగదును గుర్తించే విషయంలో ప్రభుత్వానికి సాయంగా ఉంటుంది. మొత్తం మీద ఇది అనుమానిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణలను కఠినతరం చేస్తుంది’’అని సెహగల్ వివరించారు. -
విలాసాలకు మారుపేరు
బ్యాంకులకు రూ.9,000 కోట్లకుపైగా ఎగ్గొట్టి్ట లండన్‌కు పారిపోయిన విజయ్ మాల్యాను పరారీలో ఉన్న ఆర్థిక నేరస్తుడిగా ముంబై కోర్టు ప్రకటించింది. దీంతో దేశ విదేశాల్లో ఉన్న మాల్యా ఆస్తుల్ని జప్తు చేసే అధికారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ)కు లభించింది. రాజ ప్రాసాదాలను తలపించే భవంతులు, ప్రకృతి సౌందర్యానికి మారుపేరుగా నిలిచే ఎస్టేట్లు, సకల సౌకర్యాలున్న విమానాలు, విలాసవంతమైన నౌకలు, రేసు కార్లు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్‌లు.. ఇలా చెప్పుకుంటూ పోతే మాల్యాకున్న ఆస్తులు కోకొల్లలు. మాల్యా స్థిర చరాస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయో, ఎన్ని ఉన్నాయో ఈడీ ఒక జాబితా రూపొందించింది. బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, భూములు, భవంతులను గుర్తించింది. ఈడీ జప్తు చేయడానికి రూపొందించిన జాబితా ఇదే.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో మాల్యాకు కోట్లాది రూపాయల విలువ చేసే భూము లు, ఫామ్ హౌస్‌లు ఉన్నాయి. మొత్తం 3.09 లక్షల చదరపు అడుగుల భూమి ఉంది. కర్ణాటక: బెంగళూరులో మాల్స్, మరో నాలుగు గ్రామాల్లో భూములు ఉన్నాయి. వీటి విలువ రూ.1,937.5 కోట్లుగా ఉంది. బెంగళూరులో యూబీ సిటీ మాల్ విలువ రూ.713 కోట్ల వరకు ఉంటుంది. అలాగే రూ.962 కోట్లతో కింగ్‌ఫిషర్ టవర్ నిర్మాణంలో ఉంది. మహారాష్ట్ర: ముంబై, ఆలిబాగ్లో ఫామ్ హౌస్‌లున్నాయి. వాటి ఖరీదు రూ.28.02 కోట్లకుపైమాటే. తమిళనాడు: వెల్లూరు జిల్లాలో భూముల విలువ రూ. 1.14 కోట్ల వరకూ ఉంటుంది. ఇవే కాక వివిధ కంపెనీల్లో మాల్యాకు షేర్లు ఉన్నాయి. యూబీఎల్ కంపెనీలో ఆయనకున్న షేర్ల విలువరూ. 8,758 కోట్లు కాగా, యూఎస్‌ఎల్‌లో రూ.1,692 కోట్లు, యూబీహెచ్ఎల్ రూ.27 కోట్లు, మెక్‌డొవెల్ రూ.10 కోట్ల విలువైన షేర్లు ఉన్నట్లు ఈడీ జాబితాలో తెలిపింది. ఈడీ జాబితాలో లేనివి మరికొన్ని.. ప్రపంచవ్యాప్తంగా మాల్యాకు ఎస్టేట్లు, భవనాలు మొత్తం రెండు డజన్లకుపైగా ఉన్నాయి. కాలిఫోర్నియాలో 11వేల చ.అ.విస్తీర్ణంలో ఎస్టేట్ ఉంది. దీని విలువ 12 లక్షల డాలర్లు. న్యూయార్క్‌లోని ప్రఖ్యాతిగాంచిన ట్రంప్ ప్లాజాలో పెంట్ హౌస్, దక్షిణాఫ్రికాలో జోహన్నెస్‌బర్గ్ సమీపంలో 12,000 హెక్టార్లలో విస్తరించిన మబూలా గేమ్లాడ్జ్, అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఎస్టేట్, ఫ్రాన్స్‌లోని రివిరా పట్టణానికి సమీపంలోని లగ్జరీ ఎస్టేట్, భారత్‌లోని కర్ణాటకలో కునిగల్ పట్టణం దగ్గర 400 ఎకరాల్లో విస్తరించిన గుర్రపు శాల(స్టడ్ ఫామ్), గోవాలో రాజభవంతిని తలపించే కింగ్‌ఫిషర్ విల్లా వంటి స్థిరాస్తులు మాల్యా సొంతం. సొంత పనులకు 4 విమానాలు కింగ్‌ఫిషర్ వంటి విమానయాన సంస్థను నడిపించిన ప్రముఖ వ్యక్తికి తనకంటూ సొంతంగా విమానం ఉండటం ఏమంత పెద్ద విషయం కాదు. మాల్యా ఎక్కడికి వెళ్లాలన్నా సరే విమానంలోనే వెళ్లేవారు. మొత్తం నాలుగు విమానాలను ఆయన వినియోగించేవారు. ప్రపంచంలోని తనకున్న ఎస్టేట్లలో ఎక్కడికి వెళ్లాలన్నా బోయింగ్ 727 రకం విమానాన్ని వాడేవారు. మాల్యా దగ్గరున్న ఎయిర్‌బస్ ఏ319 విమానం లండన్ నుంచి అమెరికాకు ఒకే ఒక్క హాల్ట్‌తో ప్రయాణించగలదు. ఇక హాకర్ హెచ్ఎస్125, గల్ఫ్ స్ట్రీమ్ త్రీ అనే మరో రెండు విమానాలు కూడా ఎప్పడూ మాల్యా కోసం సిద్ధంగా ఉండేవి. తన అభిరుచికి తగ్గట్టుగా ఆ విమానంలో ఆయన సకల అధునాతన సౌకర్యాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇవి కాకుండా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన స్పోర్ట్స్ కార్లు విజయ్ మాల్యా వద్ద చాలా ఉన్నాయి. బెంగళూరులోని యూబీ సిటీ మాల్ -
డాక్టర్లపై పర్ఫార్మెన్స్ కత్తి
► ప్రతి నెలా వైద్యులకు గ్రేడింగ్‌లు ► ఈ నెల నుంచే వర్తింపు..ప్రభుత్వ ఉత్తర్వులు జారీ విధులకు డుమ్మా కొట్టే, సమయపాలన పాటించని డాక్టర్లకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో (పీహెచ్సీ), సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో (సీహెచ్‌సీ) పనిచేసే డాక్టర్ల పనితీరును తెలుసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని ప్రతి ఒక్క పీహెచ్సీ, సీహెచ్‌సీలో పనిచేసే డాక్టర్లు ప్రజలకు అందిస్తున్న వైద్య సేవల ఆధారంగా పాయింట్లను ఇచ్చి నెలవారీ గ్రేడింగ్‌లను కేటాయించనుంది. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులతో విధులకు సక్రమంగా హాజరుకానివారిలో ఆందోళన నెలకొంది. నెల్లూరు (బారకాసు) : ప్రజలకు పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో అందుతున్న వైద్య సేవల ఆధారంగా డాక్టర్లకు గ్రేడింగ్ ఇవ్వనున్నారు. గ్రేడింగ్ ఆధారంగా డాక్టర్ల పనితీరు (కీ–పర్ఫార్మెన్స్ ఇండికేటర్)ను మదింపు చేయనున్నారు. ఈ నెల నుంచి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి పీహెచ్సీ పరిధిలోని వైద్యాధికారి నెలలో ఎన్ని ఆరోగ్య ఉపకేంద్రాలను సందర్శిం చారు? ఎంత మంది అవుట్ పేషెంట్లు (ఓపీ)ను చూశా రు? హైరిస్క్ ప్రెగ్నెన్సీ కేసుల్ని ఎన్ని గుర్తించారు? వారికి అందించిన వైద్య సేవలేమిటి? సామాజిక వ్యాధుల నిర్మూలనకు తీసుకున్న చర్యలు, ఇమ్యునైజేషన్ కార్యక్రమాల అమలు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ సేవలు, ఎన్టీఆర్ బేబీ కిట్, జననీ సురక్షణ యోజన పారితోషికం, నెలలో విధులకు ఎన్ని రోజులు హాజరయ్యారు, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సమావేశం నిర్వహించారా? వంటి అంశాల ఆధారంగా వైద్యాధికారులకు గ్రేడింగ్‌లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిలో కొన్ని అంశాలకు 5 మార్కులు, మరికొన్నింటికి 2.5 మార్కులు కేటాయిస్తారు. వంద మార్కులకు వైద్యాధికారుల పనితీరుని ప్రతినెలా మదింపు చేసి జిల్లా స్థాయిలో గ్రేడింగ్‌లను కేటాయిస్తారు. నెలలో ఒక్కో వైద్యాధికారి కనీసం 2,500 మంది అవుట్ పేషంట్లను చూడాలని లక్ష్యంగా నిర్దేశించారు. రాష్ట్ర వైద్యారో గ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఆదేశాలతో వీరి పనితీరును అంచనా వేశారు. ఇది ప్రతి నెలా ఉంటుందని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. ప్రతి నెలా 10వ తేదీ ఈ వివరాలతో కూడిన నమూనాలను పూర్తి చేసి పీహెచ్‌సీలోని వైద్యాధికారులు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయానికి పంపాల్సి ఉంటుంది. పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో పనిచేసే రెగ్యులర్, కాంట్రాక్ట్ వైద్యాధికారులు ప్రతి ఒక్కరికీ ఈ నిబంధనలు వర్తిస్తాయి. ప్రోత్సాహకాలు విధుల్లో మంచి పనితీరు కనబరిచే వైద్యాధికారులకు గ్రేడ్ల ఆధారంగా ప్రోత్సాహకాలను అందించనున్నట్లు ప్రభుత్వ ఆదేశాల్లో పే ర్కొంది. మంచి మార్కులు వచ్చినవారికి నగదు రివార్డులను సైతం ఇవ్వనున్నారు. ఈ పోటీల్లో ప్రతి వైద్యాధికారీ పాల్గొని తీరాల్సిందే. చాలా వరకు పీహెచ్సీ, సీహెచ్‌సీల్లో వైద్యాధికారులు అందుబాటులో ఉండటం లేదని, సమయపాలన పాటించలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో గ్రేడింగ్ విధానం వైద్యుల్లో జవాబుదారితనం పెంచనుంది. -
‘క్యూల’ అధ్యయనం చకచకా
తిరుమల : తిరుమలకు వచ్చే యాత్రికులు వేంకటేశ్వరస్వామిని సంతృప్తికరంగా దర్శించుకునే అవకాశం కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై బుధవారం కూడా అధ్యయనం కొనసాగింది. టీటీడీ జేఈవో కేఎస్శ్రీనివాసరాజు, ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితర అధికారులు వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో తనిఖీ చేశారు. అక్కడే సమావేశమై విధి విధానాలపై చర్చించారు. సర్వదర్శనం, కాలిబాట దర్శనం, రూ.300 టికెట్ల దర్శనం, చంటి బిడ్డ తల్లిదండ్రుల దర్శనం, ఆర్జిత సేవల భక్తులు.. ఇలా ఏ రోజు ఎంతమంది భక్తులు వస్తున్నారు? ఏయే క్యూలలో ఎంతమేర వత్తిడి ఉంది? అన్న విషయాలను గుర్తించి రికార్డు చేశారు. రద్దీ తక్కువ వేళ క్యూ నడిచే విధానాన్ని, గంటకు ఎంత మందికి గర్భాలయ మూలమూర్తి దర్శన భాగ్యం కలిగింది? వంటి వివరాలతో ప్రత్యేకంగా మ్యాపు సిద్ధం చేశారు. వీటి ఆధారంగా స్వల్ప మార్పులు చేసి వాటిని అమలు చేయాలని ఆలయ అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు.