సాక్షి, హైదరాబాద్/సంగారెడ్డి: తెలంగాణలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా సంగారెడ్డిలో మాల్కాపూర్ చెరువులో కట్టిన అక్రమ నిర్మాణాన్ని అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన బహుళ అంతస్తుల భవనాన్ని క్షణాల్లో కూల్చివేశారు.
మాల్కాపూర్ చెరువులో నిర్మించిన అక్రమ నిర్మాణాలను అధికారులు నేలమట్టం చేశారు. చెరువు నీటి మధ్యలో కట్టిన ఓ భవనాన్ని బ్లాస్టింగ్ చేసి కూల్చివేశారు. దీంతో, క్షణాల వ్యవధిలో భవనం కుప్పకూలిపోయింది. బిల్డింగ్ కూల్చివేస్తున్న సమయంలో రాయి వచ్చి తలకు తగలడంతో హోంగార్డ్ గోపాల్ గాయపడ్డారు. దీంతో, అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఇదిలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని మూసీ పరివాహక ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది. ఇల్లు ఖాళీ చేయడానికి నిర్వాసితులు ససేమిరా అంటున్నారు. ఈ క్రమంలో అధికారులు.. ఇళ్లకు మార్కింగ్ చేసి వెళ్తున్నారు. ఈ సందర్బంగా బాధితులు మాట్లాడుతూ.. రెండు అంతస్తుల బిల్డింగ్ ఉన్నా ఒక డబుల్ బెడ్‌రూమ్ ఎలా ఇస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇంట్లో ఉన్న కుటుంబాల ఆధారంగా వారికి ఉన్న స్థలం ఆధారంగా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇక, మూసీ పరివాహక ప్రాంతాల్లో 25 ప్రత్యేక సర్వే బృందాలు పర్యటిస్తున్నాయి. ఇప్పటికే 13వేల ఆక్రమణలను ప్రభుత్వం గుర్తించింది. అర్హులైన పేదలకు పునరావాసం కల్పించేందుకు వివరాలు సేకరిస్తున్నారు. భారీ బందోబస్తు మధ్య సర్వే కొనసాగుతోంది. ఒక్కో టీమ్‌లో ఎమ్మార్వోతో పాటు ఐదుగురు ఆఫీసర్లు ఉన్నారు. మరోవైపు.. సర్వే అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు.
ఇది కూడా చదవండి: హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment