రైల్వేల్యాండ్‌లో ఆక్రమణలు కూల్చివేత | illegal constructions Demolition in railway land malkajgiri | Sakshi
Sakshi News home page

రైల్వేల్యాండ్‌లో ఆక్రమణలు కూల్చివేత

Published Mon, Sep 19 2016 11:21 AM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

illegal constructions Demolition in railway land malkajgiri

హైదరాబాద్: రైల్వేల్యాండ్‌లో అక్రమంగా వేసిన గుడిసెలను రైల్వే అధికారులు తొలగిస్తున్న క్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. తమ గూడు కూల్చేస్తే ఎక్కడికి వెళ్లి బతకాలంటూ నిరసన చేపడుతున్నారు. మల్కాజిగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలోని పటేల్ నగర్, ఎస్.పీ నగర్‌లోని రైల్వే ల్యాండ్‌లో గత కొంత కాలంగా కొందరు గుడిసెలు వేసుకొని నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ఈ రోజు రైల్వే అధికారులు వాటిని తొలగించడానికి ప్రయత్నిస్తుండగా.. స్థానికులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని నిరసనకారులకు నచ్చజెప్పడానికి యత్నిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొని ఉంది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement