థానేలో అక్రమ కట్టడాలపై కొరడా | illegal constructions demolished in presence of tmc commissioner | Sakshi
Sakshi News home page

థానేలో అక్రమ కట్టడాలపై కొరడా

Published Tue, Dec 6 2016 5:41 PM | Last Updated on Mon, Sep 4 2017 10:04 PM

అక్రమ కట్టడాలపై థానే మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ సంజీవ్ కొరడా ఝులిపిస్తున్నారు.

ముంబై: ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై థానే మున్సిపల్ కార్పొరేషన్ (టీఎంసీ) కమిషనర్ సంజీవ్ జైస్వాల్ కొరడా ఝులిపిస్తున్నారు. అందులో భాగంగా అక్రమ కట్టడాల కూల్చివేత పనులు చేట్టిన సిబ్బంది ఐదు రోజుల్లో థానే-ముంబ్రా ప్రాంతాల్లో వెలసిన వెయ్యికి పైగా అక్రమ కట్టడాలను నేలమట్టం చేశారు. టీఎంసీ పరిధిలో ఇంత తక్కువ సమయంలో పెద్ద సంఖ్యలో అక్రమ కట్టడాలను నేలమట్టం చేయడం ఇదే తొలిసారి. టీఎంసీ పరిధిలో ప్రభుత్వ, కార్పొరేషన్ స్థలాలు అనేకం ఉన్నాయి. వాటిపై నిఘావేసే నాథుడే లేక అనేక అక్రమ కట్టడాలు వెలిశాయి. ఇటీవల సత్యం భవనం భూగర్భంలో రెండు అంతస్తులు అక్రమంగా నిర్మించినట్లు వెలుగులోకి రావడంతో జైస్వాల్ చర్యలు తీసుకున్నారు.

ముంబ్రాలోని శీల్ రోడ్ నుంచి కల్యాణ్ ఫాటా వరకు అక్రమంగా వెలసిన 40 హుక్కా సెంటర్లు, పార్లర్లు, దాబాలు, 10 లాడ్జిలు, సుమారు 400పైగా మోటార్ గ్యారెజ్‌లను సిబ్బంది కూల్చేశారు. ముఖ్యంగా వీటిని సిబ్బంది నేల మట్టం చేస్తుండగా స్వయంగా సంజీవ్ జైస్వాల్ అక్కడే ఉన్నారు. దీంతో సిబ్బంది ఎవరికి భయపడకుండా పనులు పూర్తిచేశారు. గత వారం నుంచి కొనసాగుతున్న అక్రమ కట్టడాల కూల్చివేత పనులతో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. అక్కడ అనేక భవనాలు టీఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండానే నిర్మించారు. దీంతో తమపై ఎక్కడ వేటు పడుతుందోనని బిక్కుబిక్కు మంటు కాలం వెల్లదీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement