నగరంలో ఎలాంటి అనుమతుల్లేకుండా అక్రమంగా నిర్మాణాలకు పాల్పడుతున్న నిర్మాణదారులు...అక్రమ నిర్మాణాల్ని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారుల తీరు వల్ల అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మరోవైపు శిథిల భవనాల విషయంలోనూ ఇదే అశ్రద్ధ వల్ల ఒక్కటొక్కటిగా కూలుతున్న భవనాలతోనూ ప్రాణాలు పోతున్నాయి.