పౌర సరఫరాల శాఖ అధికారుల దాడులు
కోదాడఅర్బన్
కోదాడ పట్టణంలోని పలుచోట్ల శనివారం పౌరసరఫరాల టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. వాణిజ్య అవసరాలకు వినియోగిస్తున్న సుమారు 60 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలోని రంగా థియేటర్ సమీపంలో గ్యాస్ స్టవ్ రిపేరింగ్ సెంటర్ల పేరుతో నడుస్తున్న గ్యాస్ రీఫిల్లింగ్ సెంటర్లపై కూడా వారు దాడి చేసి అక్కడి గృహ వినియోగ సిలిండర్లు, కాటాలను స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా పలు హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర ప్రాంతాల్లో దాడి చేసి అక్రమంగా వినియోగిస్తున్న 60 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కోదాడ, తుంగతుర్తి డీటీసీఎస్‌లు రమణారావు, బ్రహ్మయ్యలతో పాటు పలువురు డీటీసీఎస్‌లు, సివిల్‌సప్లైస్ అధికారులు పాల్గొన్నారు.