చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి
Published Wed, Aug 17 2016 1:01 AM | Last Updated on Fri, Sep 28 2018 3:41 PM
మంగళితండా(కోదాడరూరల్): 40 రోజుల క్రితం గొడ్డలితో దాడిచేయడంతో వ్యక్తి చికిత్సపొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని చిమిర్యాల ఆవాస గ్రామమైన మంగళితండాలో మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తండాకు చెందిన ధరవత్ స్వామి(50), ధరవత్ వీరయ్యలకు గతంలో పాత కక్షలున్నాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని వీరయ్య స్వామిని 40 రోజుల క్రితం గొడ్డలితో తల, ఛాతీపై నరికాడు. అతన్ని చికిత్స నిమిత్తం ఖమ్మం వైద్యశాలకు తరలించారు. చికిత్స తర్వాత కోలుకున్న అతన్ని ఇంటి వద్దకు తీసుక వచ్చారు. మళ్లీ అతను అనారోగ్యం పాలు కావడంతో ఈ నెల 14న ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స అనంతరం సోమవారం ఇంటికి తీసుకోచ్చారు. సోమవారం బాగానే ఉన్న అతను మంగళవారం తెల్లవారుజామున చూసే వరకు మృతి చెంది ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. అయితే స్వామి మృతి చెందడానికి కారణం వీరయ్య అని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని అతని ఇంటి ఎదుట ఉంచి తమకు న్యాయం చేయాలని ధర్నా చేశారు. విషయం తెలసుకున్న రూరల్ ఎస్‌ఐ విజయ్‌ప్రకాశ్ తండాకు చేరుకుని వారికి న్యాయం జరిగే విధంగా చూస్తానని తెలిపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోదాడ వైద్యశాలకు తరలించారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. తన భర ్తను వీరయ్య గొడ్డలితో నరకడంతోనే మృతి చెందాడని ఆరోపిస్తు భార్య కాంతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
గాయాలతో మృతి చెందలేదు....
S కాగ స్వామి గొడ్డలి గాయాలతో చనిపోలేదని అతను అనారోగ్యం పాలై మృతి చెందాడాని వీరయ్య బంధువులు అంటున్నారు. 40 రోజుల కిత్రం గాయాలైన తర్వాత ఆయన గ్రామంలో బాగానే తిరిగాడాని వారు తెలిపారు.
Advertisement
Advertisement