సాక్షి, సూర్యాపేట: కోదాడ మండలం కొమురబండ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అదుపుతప్పి ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కార్లు బలంగా ఢీ కొనడంతో వాహనాల్లో ఉన్నవారు దగ్గర్లోని పొల్లాలో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఒక కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద తీవ్రతను చూస్తే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి పండగ ముగించుకుని హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment