komarabanda
-
కొమురబండ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, సూర్యాపేట: కోదాడ మండలం కొమురబండ వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు కార్లు అదుపుతప్పి ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. కార్లు బలంగా ఢీ కొనడంతో వాహనాల్లో ఉన్నవారు దగ్గర్లోని పొల్లాలో ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో ఒక కారు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రమాద తీవ్రతను చూస్తే.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సంక్రాంతి పండగ ముగించుకుని హైదరాబాద్కు తిరుగు ప్రయాణంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. కాగా, ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
కొమరబండలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన
కొమరబండ(కోదాడరూరల్): మండలంలోని కొమరబండలో రూ.9లక్షల ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు బుధవారం సర్పంచ్ సంపెటరవిగౌడ్, ఎంపీటీసీ బత్తుల వెంకన్నలు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలో మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ వంగవీటి రామారావు, పీఆర్ఎఈ సీహెచ్.లక్ష్మారెడ్డి, ఉపసర్పంచ్ శకుంతల, కార్యదర్శి రాబిన్, వీఆర్వో దిలావర్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.