Published
Sat, Aug 13 2016 6:01 PM
| Last Updated on Mon, Sep 4 2017 9:08 AM
విగ్రహ ఏర్పాటుకు స్థల పరిశీలన
రామాపురంక్రాస్‌రోడ్(కోదాడరూరల్): రాష్ట్ర సరిహద్దు కోదాడ మండలం నల్లబండగూడెం శివారు రామాపురంక్రాస్ రోడ్‌లోని పాలేరు వంతెన వద్ద తెలంగాణ తల్లి బారీ విగ్రహ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. దీంతోబాటు ఈ ప్రాంత తెలంగాణ పోరాట యోదుడు కీసర జీతేందర్‌రెడ్డి విగ్రహాన్ని, అమర వీరుల స్థూప నిర్మాణానికి టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సరిహద్లులో ఎపీ నుంచి∙వచ్చే ప్రజలకు, ప్రయాణికులకు స్వాగతం పలికే విధంగా తెలంగాణ తల్లి భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే రాష్ట్ర మంత్రులచే ఈ పనుల ప్రారంభానికి శంస్థాపన జరుగుతుందన్నారు. ఉద్యమ సమయంలో ఈ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సమరయోధుల సంఘం సభ్యులు కత్రం సీతరారంరెడ్డి, కొడారు వెంకటయ్య, సీహెచ్.విశ్వేశ్వరావు, శివాజీరెడ్డి, తిరపతయ్య, సత్యనారాయణ, నాయకులు వాచేపల్లి వెంకటేశ్వరెడ్డి, ఈదుల కృష్ణయ్య, ముండ్రా వెంకట్రావ్, నల్లపాటి శ్రీనివాసరావు, ఎర్రమళ్ల వెంకటేశ్వర్లు , నిరంజన్‌రెడ్డి తదితరులున్నారు.