సాక్షి,హైదరాబాద్: తెలంగాణ సెక్రటేరియట్ ప్రాంగణంలో కొత్తగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించారు. సోమవారం(డిసెంబర్ 9) సాయంత్రం ఆరు గంటలకు అట్టహాసంగా విగ్రహావిష్కరణ కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమంలో మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు,ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు. సెక్రటేరియట్‌లో 20 అడుగుల తెలంగాణతల్లి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. చేతిలో వరి,జొన్న, సజ్జ ధాన్యాలతో విగ్రహాన్ని రూపొందించారు.
తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం మన అదృష్టం: సీఎం రేవంత్
- మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతిరూపం తెలంగాణతల్లి
- 4 కోట్ల ప్రజల ఆకాంక్షను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది
- ఉద్యమ సమయంలో టీజీని యువకులు తమ గుండెలపై రాసుకున్నారు
- బీఆర్‌ఎస్ టీజీ అని కాకుండా టీఎస్ అని మార్చింది.
- తమ కుటుంబం కోసమే గత ప్రభుత్వం ఆలోచించింది
- ఈరోజు తెలంగాణతల్లి విగ్రహం ఆవిష్కరించుకోవడం మన అదృష్టం
తెలంగాణ ప్రజలు కోరుకునేది స్వేచ్చను: భట్టి విక్రమార్క
Comments
Please login to add a commentAdd a comment