సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సచివాలయంలో మంగళవారం(జులై 16) ఇంటర్నెట్ సేవలకు అంతరాయం ఏర్పడింది. దాదాపు రెండు గంటలకుపైగానే ఇంటర్నెట్ సేవలు నిలిచిపోయాయి. ఇంటర్నెట్ లేకపోవడంతో సెక్రటేరియట్‌లో పలు శాఖల సేవలకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు.. కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం జరుపుతుండగానే ఈ విఘాతం చోటు చేసుకోవడం గమనార్హం.
సెక్రటేరియెట్‌కు ఇంటర్నెట్ సేవలు అందించే ‘నిపుణ’ నెట్‌వర్క్‌కు పెండింగ్ బిల్లులు కోట్ల రూపాయల్లో పేరుకుపోయాయని, అందుకే సేవలు నిలిచిపోయాననే ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజులుగా బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వం పెండింగ్ బిల్లులు చెల్లించడం లేదని.. దీంతో ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లేందుకే ఇంటర్ నెట్ నిలిపివేసిందని కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే.. అధికారులు మాత్రం టెక్నికల్‌గా తలెత్తిన సమస్యేనని, కాసేపటికే వైఫై సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయని అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment