Published
Mon, Aug 1 2016 8:32 PM
| Last Updated on Thu, Oct 4 2018 7:01 PM
చర్చిలో విదేశీయుల సందడి
కోదాడ: పట్టణంలోని గాంధీనగర్‌లో ఉన్న సీఎస్‌ఐ చర్చిలో సోమవారం ఇంగ్లాండ్ దేశానికి చెందిన పలువురు సందడి చేశారు. గ్లోస్టర్ డయాసిస్ బృందం చర్చిల సందర్శనలో భాగంగా ఇక్కడికి వచ్చారు. వీరిని నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం చర్చి ఆవరణలో మెుక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ బిషప్ ఆనందరావు, అశోక్‌సాల్మన్, జాన్‌వెస్లీ, నెమ్మాది భాస్కర్, ఏర్పుల యాకోబు, కర్ల సుందర్‌బాబు, ఏర్పుల వెంకటేష్, సునీల్, రాజేష్ పాల్గొన్నారు.