ప్రతీకాత్మక చిత్రం
సాక్షి,కోదాడ: భార్యకు వీడియో కాల్ చేసి ఓ వ్యక్తి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడలోని సాయిబాబా థియేటర్ బజార్‌లో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని వత్సవాయి మండలం వేమవరం గ్రామానికి చెందిన రుంజా అశోక్(32) టాటాఏస్ వాహనం డ్రైవర్‌గా పని చేస్తుంటాడు. లాక్‌డౌన్ కారణంగా పనిదొరక్క పోవడంతో ఇంటి వద్దే ఉంటున్నాడు. భార్యది కాపుగల్లు కావడంతో ఏదైనా పని చేసుకుందామని నెలరోజుల కిందట కోదాడ పట్టణానికి వచ్చి అద్దె ఇంట్లో ఉంటున్నారు.
పని లేకపోవడం.. తాగుడుకు అలవాటుపడిన అశోక్ భార్య పిల్లలను పుట్టింటికి పంపించాడు. శుక్రవారం రాత్రి నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని పిల్లలను మంచిగా చూసుకో అని భార్యకు వీడియో కాల్ చేసి చెప్పాడు. వెంటనే వారు కోదాడకు వచ్చి చూసేవరకు అప్పటికే అశోక్ మృతి చెంది ఉన్నట్లు తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి దావిద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ సైదా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment