సూర్యాపేట జిల్లా కోదాడలో ఆదివారం ఖమ్మం క్రాస్ రోడ్డు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో అయిదుగురు దుర్మరణం చెందగా, పలువురు గాయపడ్డారు. ఎదురుగా వస్తున్న లారీ అతి వేగంగా ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కోదాడకు చెందిన వీరంతా శ్రీరామ నవమి సందర్భంగా రాముల వారి కళ్యాణానికి వెళ్లి ఇంటికి తిరిగి వెళుతుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. తమ్మర గ్రామంలో జరుగుతున్న సీతారాముల కళ్యాణానికి వెళ్లిన వీరంతా రోడ్డు ప్రమాదానికి గురి కావడంతో స్థానికంగా విషాదాన్ని నింపింది.