కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అధికారులు
కోదాడ ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శించిన అధికారులు
Published Tue, Oct 4 2016 11:03 PM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
కోదాడఅర్బన్ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వచ్ఛ అభియాన్ పథకంలో భాగంగా మెరుగైన సౌకర్యాలు కల్పించిన ప్రభుత్వ ఆస్పత్రులకు అవార్డులు అందజేయనున్నుట్లు రాష్ట్ర కుటుంబ నియంత్రణ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎ.ప్రభావతి తెలిపారు. స్వచ్ఛ అభియాన్ కార్యక్రమం అమలు తీరును పరిశీలించేందుకు మంగళవారం ఆమె కోదాడ ప్రభుత్వాస్పత్రిని సందరించారు. ఈ సంద ర్భంగా ఆమె మాట్లాడుతూ స్వచ్ఛ అభియాన్ కింద 70శాతానికిపైగా మెరుగైన పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడుతున్న ఆస్పత్రులను ఎంపిక చేసేందుకు కాయకల్ప పథకం కింద బృందాలుగా ఏర్పడి పరిశీలన జరుపుతున్నామన్నారు. ఇందులోభాగంగా జిల్లాలో ఎంపిక చేసిన 9 పీహెచ్‌సీలు, 2 సీహెచ్‌సీలు, 1 ఏరియా ఆస్పత్రితోపాటు జిల్లా ఆస్పత్రిలో కూడా ఈ పరిశీలన జరుపనున్నట్లు తెలిపారు. అనంతరం అన్ని వార్డులతోపాటు ఆవరణ, పోస్ట్‌మార్టం గదులను పరిశీలించిన బృంద సభ్యులు అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో యునిసెఫ్ రాష్ట్ర కన్సల్టెంట్ డాక్టర్ ఉమాశంకర్, కాయకల్ప కార్యక్రమ జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ రామకృష్ణ, గర్భస్థ పిండ లింగ నిర్ధారణ నిరోధక చట్టం లీగల్ అడ్వైజర్ వాణి, వైద్య ఉద్యోగుల సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ మాండన్ సుదర్శన్, కోదాడ ఆస్పత్రి వైద్యురాలు డాక్టర్ కమల, యాతాకుల మధు, కొచ్చెర్ల సత్యం తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఆస్పత్రికి చెందిన స్థలం ఆక్రమణకు గురైందని, దీనిపై చర్యలు తీసుకోవాలని పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త కుదరవెల్లి బసవయ్య ఈ సందర్భంగాడాక్టర్ ప్రభావతిని కోరారు. దీనికి ఆమె స్పందిస్తూ ఈ విషయం తన పరిధిలోకి రాదని, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చే యాలని సూచించారు.
Advertisement
Advertisement