Love Couple Commits Suicide By Jumping Into A Kodada Pond In Suryapeta District - Sakshi
Sakshi News home page

కోదాడలో దారుణం: ప్రేమ జంట ఆత్మహత్య

Published Fri, Feb 26 2021 12:16 PM | Last Updated on Fri, Feb 26 2021 3:19 PM

Suryapet Kodad Lovers Committed Suicide In Pond - Sakshi

సాక్షి, సూర్యాపేట: జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ జంట చెరువులో పడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. కోదాడ లక్ష్మిపురం కాలనీకి చెందిన సాయి(19) ఐటీఐ పూర్తి చేశాడు. ఈ క్రమంలో ఇతడికి అదే కాలనీకి చెందిన ఫాతిమా(15)తో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం సాయి ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. మళ్లీ తిరిగి రాలేదు. ఫాతిమా నిన్న ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 

ఆ తర్వాత వీరద్దరూ కోదాడ చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ క్రమంలో శుక్రవారం వీరి శవాలు వెలుగు చూశాయి. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సింది. 

చదవండి: ఒలింపిక్‌ మాజీ జిమ్నాస్టిక్స్‌ కోచ్‌‌ ఆత్మహత్య!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement