సాక్షి, హైదరాబాద్: నగరంలో హనీ ట్రాప్ చేస్తున్న ముఠా గుట్టు రట్టు అయ్యింది. తెలంగాణ పోలీసులు హనీ ట్రాప్ ముఠాను అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా ఓ మహిళతో సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. హోమ్ డెలివరీ పేరిట ఓ మహిళ నగరంలో కొందరు వ్యక్తులను హనీ ట్రాప్ చేస్తోంది. ఈ క్రమంలో యువకులతో పరిచయం పెంచుకున్న సదరు మహిళ.. వారితో సన్నిహితంగా ఫొటోలు దిగుతోంది. ఇలా వారిలో ఫొటోలు దిగిన మరుసటి రోజే.. సదరు మహిళతో పాటు వారి గ్యాంగ్ యువకుల ఇంటి వద్ద ప్రత్యక్షమవుతున్నారు. యువకులు.. ఆమెతో ఫొటోలు దిగి మహిళను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఇంటిపై దాడి చేసి హంగామా సృష్టిస్తున్నారు. ఈ క్రమంలో మహిళ గ్యాంగ్.. బాధిత యువకుల వద్ద రూ. లక్షలు వసూలు చేస్తోంది.
దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సెంట్రల్ జోన్ పరిధిలోని పోలీసులు వారిపై ఆరు కేసులు నమోదు చేశారు. అనంతరం, హనీ ట్రాప్‌కు పాల్పడుతున్న ముఠాను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment