యూటీఎఫ్ నారాయణ కారుకు ప్రమాదం | ytf Narayana car accident | Sakshi
Sakshi News home page

యూటీఎఫ్ నారాయణ కారుకు ప్రమాదం

Published Mon, Sep 29 2014 12:11 AM | Last Updated on Sat, Sep 2 2017 2:04 PM

యూటీఎఫ్ నారాయణ కారుకు ప్రమాదం

యూటీఎఫ్ నారాయణ కారుకు ప్రమాదం

భార్య మృతి ఆయన  పరిస్థితి విషమం  నల్లగొండ జిల్లాలో ఘటన
 
కట్టంగూర్: నల్లగొండ జిల్లా కట్టంగూర్ సమీపంలోని సవుళ్లగూడెం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యూటీఎఫ్ తెలంగాణ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నాగాటి నారాయణ భార్య మృతి చెందగా నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నారాయణ, భార్య అమృత(52) కలసి కారులో హైదరాబాద్ నుంచి స్వగ్రామమైన ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం పెద్దబీరవెల్లికి బయలుదేరారు. కారును నారాయణ నడుపుతుండగా కట్టంగూర్ శివారులో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి పల్టీ కొట్టింది. అదే సమయంలో హైదరాబాద్‌కు కట్టెల లోడుతో వెళుతున్న లారీ కారును ఢీకొట్టింది. దీంతో కారులోని నారాయణ, అమృత ఎగిరి రోడ్డుపై పడిపోయారు. ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి.

మొదట 108 సిబ్బంది అమృత చనిపోయిందని భావించి నారాయణను మాత్రమే నార్కట్‌పల్లి కామినేని ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్ది సేపటి తర్వాత హైదరాబాద్‌కు వెళుతున్న స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సంఘటనస్థలం వద్ద ఆగి...హైవే సిబ్బందిని గట్టిగా మందలించడంతో కొన ఊపిరితో ఉన్న అమృతను అంబులెన్స్‌లోకామినేని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. నారాయణ పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. కారు అతివేగం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement