హక్కుల కోసం ఉద్యమం
నెల్లూరు(టౌన్):
హక్కుల కోసం మహిళా ఉపాధ్యాయులు ఉద్యమించాలని ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రమణ్యం పిలుపునిచ్చారు. స్థానిక ఎన్‌జీఓ హోమ్‌లో శుక్రవారం యూటీఎఫ్ జిల్లా స్థాయి మహిళా టీచర్ల వర్క్‌షాపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పేద బాలికలను తీర్చిదిద్దే అవకాశం ఉందన్నారు. పేద విద్యార్థుల్లో ఆత్మ విశ్వాసం పెంపొందించేలా మహిళా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని సూచించారు. యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలు డ్రాప్‌అవుట్స్‌ను మరింత పెంచేలా ఉన్నాయన్నారు. సీసీఈ విధానంలో పెరిగిన పనిభారం, వివరాలు అప్‌లోడ్‌తో వచ్చిన సమస్యలు, మహిళా సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ అసోసియేట్ సభ్యులు, అధ్యక్షులు రమాదేవి, ఏపీ ఉమెన్ టీచర్స్ ఫోరం రాష్ట్ర కో–కన్వీనర్ శ్రీదేవి, జిల్లా మహిళా కన్వీనర్ స్వర్ణలత, కో–కన్వీనర్ సుభాషిణి, ఏపీడబ్ల్యూటీఎఫ్ సభ్యురాలు మాధవిలక్ష్మీ పాల్గొన్నారు.