ఉద్యమాలకు సిద్ధం కండి
ఆత్మకూరు: సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయులు ఉద్యమాలకు సిద్ధం కావాలని యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నరసింహులు పిలుపునిచ్చారు. పట్టణంలోని థెరిస్సా కళాశాలలో శనివారం ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా జనరల్ కౌన్సిలర్ సమావేశాలను ప్రారంభించారు. ఈసందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ సమస్యల పరిష్కారం కోసం ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెపా్పరు. అనంతరం యూటీఎఫ్ మాజీ జిల్లా కార్యదర్శి తిక్కయ్య, కామేశ్వరరావు, మనోహర్, ప్రధాన కార్యదర్శి సురేష్‌కుమార్, రామశేషయ్య తదితరులు మాట్లాడారు. కార్యక్రమానికి ముందు యూటీఎఫ్ ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాల నిర్మాతలు స్వర్గీయ రామిరెడ్డి, గురుస్వామిల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సభ్యులు జనార్దన్‌రావు, మండల ప్రధాన కార్యదర్శి జాకీర్ హుసేన్, జిల్లా ఆడిటర్ రఫిక్, ట్రెజరర్ సుధాకర్, ఈశ్వరరెడ్డి, రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సీఐటీయూ డివిజన్ అధ్యక్షుడు ఏసురత్నం తదితరులు పాల్గొన్నారు.