
యూటీఎఫ్ జిల్లా సదస్సు
విజయవాడ: నగరంలోని యూటీఎఫ్ ప్రధాన కార్యాలయంలో ఆదివారం యూటీఎఫ్ జిల్లా సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ బొడ్డు నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కింద కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నవారందరినీ క్రమబద్ధీకరించాలని ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఉద్యోగుల భద్రత, వేతనాల పెంపు, తదితర డిమాండ్లపై చర్చించారు. ప్రభుత్వం త్వరితగతిన తమ సమస్యలను పరిష్కరించకుంటే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.