కౌన్సిలింగ్‌కి విరుద్ధంగా ప్రభుత్వ బదిలీలు చేయడాన్ని విరమించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఐక్యఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఐ.వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పీ. బాబురెడ్డిలు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. అన్ని శాఖల్లో బదిలీలు జరిగేప్పుడు బదిలీల ఉత్తర్వులు ఇవ్వకుండా ఇప్పడు దొడ్డిదారిన బదిలీలతో టీచర్లకు అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వ బదిలీలపై ప్రత్యక్ష కార్యాచరణ చేపడతామని హెచ్చరించారు. హెల్త్‌కార్డుల అమలులో ఉన్న లోపాలను సవరించాలని, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే చేపట్టాలి
ఉపాధ్యాయుల బదిలీలను కౌన్సిలింగ్ ద్వారా మాత్రమే చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం(ఏపీయూఎస్) రాష్ట్ర అధ్యక్షులు బాపిరాజు, ప్రధాన కార్యదర్శి యం. రాజశేఖర్ రావులు డిమాండ్ చేశారు. సిఫార్సులతో బదిలీలు చేపడితే విద్యా వ్యవస్ధ నిర్వీర్యం అవుతుందని, వెంటనే బదిలీల షెడ్యూల్‌ను ప్రకటించాలన్నారు.