
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్‌ఎంసీలో పని చేస్తున్న గ్రేడ్–1 మున్సిపల్ కమిషనర్ బి.దేవ్ సింగ్‌ను నల్లగొండ మున్సిపల్ కమిషనర్‌గా, ఎస్.పంకజను పురపాలక శాఖ సంయుక్త సంచాలకులుగా, పి.సరోజను రంగారెడ్డి జిల్లా మెప్మా పీడీగా బదిలీ చేశారు. పురపాలక శాఖ సంయుక్త సంచాలకులుగా పనిచేస్తున్న ఎన్.వాణిశ్రీతో పాటు నిజామాబాద్ అదనపు మున్సిపల్ కమిషనర్ ఎం.మంగతాయారును జీహెచ్‌ఎంసీకు బదిలీ చేశారు.
పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్ డి.జగన్‌ను ఖమ్మం అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్‌గా, వేములవాడ మున్సిపల్ కమిషనర్ ఎ.జగదీశ్వర్ గౌడ్‌ను ఇల్లందు మున్సిపల్ కమిషనర్‌గా, ఇల్లందు మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్యను హుస్నాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా, ఆర్మూరు మున్సిపల్ కమిషనర్ శైల జను నిర్మల్ జిల్లా మెప్మా అకౌంటెంట్ (ఆర్మూ రు కమిషనర్‌గా అదనపు బాధ్యతలు), నిర్మల్ మెప్మా అకౌంటెంట్ పెద్ద రామేశ్వర్‌ను పెద్ద అంబర్‌పేట్ మున్సిపల్ కమిషనర్‌గా, జగిత్యాల మునిసిపాలిటీ మేనేజర్ కె.గంగారాంను వేములవాడ మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ చేశారు.