జిల్లాలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గోవిడత జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి 1,15,482 వినతులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గురువారం పేర్కొన్నారు.
అనంతపురం అర్బన్ : జిల్లాలో జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు జరిగిన నాల్గోవిడత జన్మభూమి–మాఊరు కార్యక్రమంలో ప్రజల నుంచి 1,15,482 వినతులు వచ్చాయని జాయింట్ కలెక్టర్ బి.లక్ష్మీకాంతం గురువారం పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా 1,003 పంచాయతీలు, 373 మున్సిపల్ వార్డులు మొత్తం 1,376 చోట్ల జన్మభూమి సభలు జరిగాయని తెలిపారు. రూరల్ పరిధిలో 71, అర్బన్ పరిధిలో 24 జన్మభూమి బృందాలు పని చేశాయని వివరించారు. సంక్రాంతి కానుకలు 10,27,800 మందికి, కొత్త రేషన్ కార్డులు 72,531 మందికి పంపిణీ చేసినట్టు వివరించారు. ప్రజల నుంచి వచ్చిన 1,15,482 వినతుల్లో 79,969 ప్రధానంగా ఉన్నాయని తెలిపారు.
శాఖల వారీగా వచ్చిన వినతులు
శాఖ వినతులు
రూరల్ డెవలప్‌మెంట్ 179
రెవెన్యూ 11,166
పౌర సరఫరాలు 15,020
గృహ నిర్మాణ సంస్థ 28,477
మున్సిపల్ శాఖ 5,410
మున్సిపల్ ఆర్‌డీ 259
సెర్ఫ్ (పేదరిక నిర్మూలన) 15,906
ఉపాధి హామీ 435
ఆర్‌డబ్ల్యూఎస్ 442
పంచాయతీరాజ్ 1,088
విద్యుత్ 223
వ్యవసాయం 364
మొత్తం 978969