
ఫ్లెక్సీతో షాకిచ్చిన టీడీపీ నేత
తాళ్లరేవు : తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలం ఇంజరంలో సోమవారం ‘జన్మభూమి-మా ఊరు’ సందర్భంగా ‘సమస్యలను పరిష్కరించండి’ అంటూ టీడీపీకి చెందిన ఎమ్మెల్యేని, అధికారులను కోరుతూ అధికార పార్టీ నాయకుడే ఫ్లెక్సీని ఏర్పాటు చేయడం చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు కొరుపల్లి సత్యనారాయణమూర్తి (చిన్నబ్బాయి) ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీలో ఇంజరం హైస్కూల్‌కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని కోరారు. నిధుల్లేక నిలిచిపోయిన అదనపు తరగతి గదులు, స్కూలుకు వచ్చే రహదారి అధ్వానస్థితిని చూపే ఫొటోలను ముద్రించారు.