‘జన్మభూమి’ని అడ్డుకున్న గ్రామస్థులు
Published Fri, Jan 8 2016 11:41 AM | Last Updated on Sun, Sep 3 2017 3:19 PM
చింతలపుడి: ప్రభుత్వం ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా.. అనవసరపు ఆర్భాటాలకు పోతుందని ఆగ్రహించిన గ్రామస్థులు జన్మభూమి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా చింతలపుడిలో గురువారం నిర్వహించనున్న జన్మభూమి- మా భూమి కార్యక్రమాలకు హజరైన అధికారులకు గ్రామస్థుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది.
గ్రామానికి వచ్చే రహదారి సరిగ్గా లేదని గత కొంత కాలంగా మొర పెట్టుకుంటున్నా పట్టించుకోని అధికారులకు తమ గ్రామంలోకి వచ్చే అధికారం లేదని వారిని గ్రామ శివారులోనే అడ్డుకున్నారు. అనంతరం రహదారి లేకపోవడంతో.. గర్భిణులు ఆస్పత్రులకు వెళ్లాలన్నా.. విద్యార్థులు కళాశాలలకు వెళ్లాలన్నా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందు రహదారి నిర్మించిన ఆ తర్వాతనే జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించాలని అధికారులకు తెలిపారు. దీంతో అధికారులు ప్రజాప్రతినిధులు అక్కడి నుంచి తిరుగు ముఖం పట్టారు.
Advertisement