రెండు నిమిషాలకే జన్మభూమి వాయిదా.. | janma bhumi programme postphoned with in two minutes | Sakshi
Sakshi News home page

రెండు నిమిషాలకే జన్మభూమి వాయిదా..

Published Wed, Jan 6 2016 12:28 PM | Last Updated on Tue, Oct 2 2018 7:28 PM

janma bhumi programme postphoned with in two minutes

రొంపిచర్ల: జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధికారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు నిమిషాలకే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విపర్లరెడ్డి పాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు తమ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎండీవో మండిపడ్డాడు. ఫ్లెక్సీని తొలగిస్తేనే జన్మభూమి కార్యక్రమం జరుపుతానని తేల్చి చేప్పాడు. కాగా, ఎండీవో తీరుపై  ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం కొద్ది గ్రామస్తులు ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే.. దాని గురించి ప్రజాసమస్యలను పరిష్కరించే కార్యక్రమాన్ని ఆపడమేంటని ప్రశ్నించారు. దీంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎండీవో తిరిగి రెండు నిమిషాలకే వాయిదా వేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement