
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరుపాడులో టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దౌర్జన్యానికి దిగారు. అంబ్కేదర్ ఫ్లెక్సీని రఘురామకృష్ణంరాజు చించేశారు. ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దళిత సంఘాలు ఫ్లెక్సీని ఏర్పాటు చేయగా, రఘురామకృష్ణంరాజు తన అనుచరులతో వచ్చి చించేశారు. దీంతో రఘురామకృష్ణంరాజు తీరును వ్యతిరేకిస్తూ దళిత సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వార్
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో జనసేన, టీడీపీల మధ్య ఫ్లెక్సీ వివాదం రచ్చరచ్చగా మారింది. పాత మున్సిపల్ సెంటర్‌లో జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. ఫ్లెక్సీల్లో జగ్గయ్యపేట టీడీపీ ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ ఫోటో లేకపోవడంతో టీడీపీ కార్యకర్తలు గొడవకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
ఇదీ చదవండి: ఆ చర్చల సారాంశం చెప్పలేను: విశాఖ స్టీల్‌ప్లాంట్ సీఎండీ
Comments
Please login to add a commentAdd a comment