MDO
-
ఎంపీడీవో భారతి ఆత్మహత్యాయత్నం
సాక్షి, జక్రాన్‌పల్లి(నిజామాబాద్): జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా విధులు నిర్వహిస్తున్న భారతి శుక్రవారం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాలు.. భారతిని సిరికొండకు డిప్యూటేషన్‌పై పంపారు. అక్కడ ఎంపీడీవోగా ఉన్న లక్ష్మణ్‌ను జక్రాన్‌పల్లి ఎంపీడీవోగా డిప్యూటేషన్ వేశారు. అయితే భారతి తండ్రి అనారోగ్య కారణాలతో ఆమె సెలవులో ఉన్నారు. ఈ సమయంలో డిప్యూటేషన్‌పై పంపడంతో ఆమె తీవ్ర మానసిక ఓత్తిడికి లోనై ఆత్మహత్యాయత్నం చేసినట్లు తెలిసింది. పరిపాలన సౌలభ్యం కోసమే.. జక్రాన్‌పల్లి ఎంపీడీవో భారతిని పరిపాలన సౌలభ్యం కోసమే సిరికొండకు, సిరికొండలో ఉన్న ఎంపీడీవోను జక్రాన్‌పల్లికి డిప్యూటేషన్ వేశామని జెడ్పీ సీఈవో గోవింద్ తెలిపారు. డిప్యూటేషన్ ఇచ్చే సమయంలో భారతి తండ్రి అనారోగ్య కారణాలతో సెలవులో ఉన్నారని తెలిపారు. భారతి ఆత్మహత్యాయత్నం చేశారని తెలియడంతో ఆమెతో మాట్లాడానని చెప్పారు. ఎలాంటి ప్రమాదం లేదని సోమవారం విధులకు హాజరు కానున్నట్లు జెడ్పీ సీఈవో పేర్కొన్నారు. మహిళలపై దాడి చేసిన ఉపసర్పంచ్‌పై కేసు ఇందల్వాయి: ఎల్లారెడ్డిపల్లె గ్రామ ఉప సర్పంచ్ గొల్ల శ్రీనివాస్‌తో పాటు అతడి అనుచరులు ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఉపసర్పంచ్ తన అనుచరులతో కలిసి గురువారం రాత్రి గ్రామానికి చెందిన గొట్టిముక్కుల ఒడ్డెన్న ఇంటిపై దాడి చేసి ఇంట్లో ఉన్న మహిళలను గాయపరిచారు. వ్యక్తిగత కక్ష్యలతో తమపై దాడి చేసినట్లు బాధిత మహిళలు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేశామని ఎస్సై పేర్కొన్నారు. -
కదిలించిన ‘ఉప్పునీరు’
పుట్టిన ఊరిని ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు పట్టించుకోలేదు.. ఉద్ధరిస్తాడనుకుంటే కష్టాల దారిలో నిర్లక్ష్యంగా వదిలేయడంతో సమస్యలతో సావాసం చేస్తున్న నడిమివాడ గ్రామస్తుల దయనీయ దుస్థితిపై సాక్షి ప్రచురించిన కథనంపై ప్రభుత్వ యంత్రాంగం కదిలింది. ప్రభుత్వ పథకాలేవీ వారి దరి చేరలేదన్న విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ ప్రవీణ్‌కుమార్.. తక్షణం గ్రామానికి వెళ్లి ప్రజా సమస్యలపై సమగ్ర నివేదిక రూపొందించాలంటూ మండల అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాలతో స్థానిక అధికారులు గ్రామాన్ని హుటాహుటిన సందర్శించారు. నడిమివాడలో ఉండే ప్రతి సమస్యనూ సత్వరమే పరిష్కరించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ సాక్షికి తెలిపారు. విశాఖసిటీ, పెదబయలు: ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు స్వగ్రామంలో గిరిజన కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ‘విప్ ఊరు.. ఉప్పు నీరు’ అనే శీర్షికన సోమవారం ‘సాక్షి’ లో ప్రచురించిన కథనంపై కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ స్పందించారు. గిన్నెలకోట పంచాయితీ నడిమివాడ గ్రామస్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను సాక్షిపత్రికలో చదివిన ఆయన మండల అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రజల ఇబ్బందులు, తాగునీటి సమస్యతో పాటు పింఛన్ కష్టాలు, పౌష్టికాహార లోపం, సాగునీటి కష్టాలకు సంబంధించిన అన్ని వివరాలూ క్షేత్రస్థాయిలో పరిశీలించి అందించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలతో ఎంపీడీవో వసంతరావు నాయక్ సోమవారం హుటాహుటిన నడిమివాడ గ్రామాన్ని సందర్శించారు. గ్రామస్తులు తాగుతున్న ఊట నీటిని, గ్రామంలో ప్రభుత్వం ద్వారా పథకాలు అందుతున్నాయా లేదా అనే వివరాల గురించి అ డిగి తెలుసుకున్నారు. గ్రామంలో 9 కుటుంబాలు ఉన్నా ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎన్టీఆర్ పక్కా గృహాలు మంజూరు చేయడం లేదని, మట్టి ఇళ్లల్లో ఉంటూ ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్ల పైకప్పు పెంకులు పగిలిపోతే పాలిథిన్ టార్ఫాలిన్ కవర్లు కట్టుకుని నివాసం ఉంటున్నామంటూ గోడు వెలి బుచ్చారు. అర్హులైన నిరుపేదలకు రేషన్‌కార్డులు ఇవ్వడం లేదంటూ ఫిర్యాదు చేశారు. గ్రామానికి వచ్చేందుకు సరైన రహదారి మార్గంలేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ ఏకరువుపెట్టారు. గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టు నిర్మాణం చేస్తే.. ఉపాధి కోసం ఆవలి ప్రాంతాలకువెళ్లే మార్గం సుగమమవుతుందని ప్రజలు తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం అం దించేందుకు గ్రామానికి మినీ అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని కోరారు. నడిమివాడ, గుండాలగరువు గ్రామాల పిల్లలు, గర్భిణులు, బాలింతలు ఇంజరి పంచాయతీ చెందిన మల్లెపుట్టు గ్రామంలోని అం గన్వాడీ కేంద్రానికి వెళ్లి ఫీడింగ్ సరుకులు తీసుకొ చ్చేందుకు నరక యాతన అనుభవిస్తున్నారని ఎం పీడీవో ఎదుట ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే గ్రామంలో పంట భూములకు నీరందించేందుకు సరియాల గెడ్డ సమీపంలో, కొండవాలు గెడ్డ ప్రాం తాల్లో చెక్‌డ్యాంలు మంజూరు చేయాలని గ్రామస్తులు విన్నవించుకున్నారు. ఉపాధి పొందేందుకు కాఫీ మొక్కలు పంపిణీ చేయాలని కోరారు. మరోవైపు.. ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి రవి పట్టన్‌శెట్టి సాక్షి కథనంపై స్పందిస్తూ గ్రామంలో తాగునీటిసమస్య పరిష్కరించేందుకు మంచినీటి పథకం ఏర్పాటు చెయ్యాలని ఆర్‌డబ్లు్యఎస్ విభా గం అధికారులను ఆదేశించారు. ఆయన ఆదేశాల మేరకు నడిమివాడ గ్రామంలో ఆర్‌డబ్లు్యఎస్ సైట్ ఇంజనీర్ మత్స్యలింగం సోమవారం పర్యటించా రు. గ్రామంలో సత్యసాయి సేవా సంస్థ నిర్మించిన గ్రావిటీ పథకం నిరుపయోగంగా ఉండటాన్ని గమనించి ప్రాజెక్టు డైరెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే మరమ్మతులు చేసి పథకాన్ని అందుబాటులో తెచ్చేందుకు వెలుగు పథకం ద్వారా నిదులు కేటాయించాలని ఐటీడీఏ పీవో ఆదేశించారని ఆర్‌డబ్లు్యఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీ ర్ రాంప్రసాద్ తెలిపారు. పెదబయలు ఆర్‌డబ్లుఎస్ జేఈ జగదీష్ సైతం నడిమివాడ గ్రామాన్ని సందర్శించి వాటర్ స్కీం మరమ్మతుల కోసం అయ్యే అంచనాల్ని రూపొందించి ఒకవారంరోజుల్లో గ్రావిటీ స్కీంని వినియోగంలోకి తీసుకు వస్తామని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీలతో పాటు గ్రామాన్నే మరిచిపోయారు.. మీరలా కాకూడదంటూ ఎంపీడీవోని గ్రామస్తులు విజ్ఞప్తి చేశారు. గ్రామానికి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి : ఎంపీడీవో వసంతరావు నాయక్ నడిమివాడ గ్రామానికి తాగునీరు, పక్కా గృహాలు , రోడ్డు, కల్వర్టు సమస్యలు ఉందని ఎంపీడీవో వి.వసంతరావునాయక్ తెలిపారు. గ్రామంలో 3 వేల మీటర్లు దూరంలో ఉన్న అంబలిమామిడి కొండ ప్రాంతం నుంచి గ్రావిటీ పథకం మంజూరు చేయడం జరుగుతుందని, గ్రామ సమీపంలో గెడ్డకు కల్వర్టుకు ప్రతిపాధనలు పంపిస్తామన్నారు. గ్రామంలో 9 కుటుంబాలకు ఎన్టీఆర్ గృహాలు మంజూరు చేస్తామని, నడిమివాడ, గుండాలగరువు గ్రామాలకు కలిపి అంగన్వాడీ కేంద్రం మంజూరు చేస్తామని తెలిపారు. ఉపాధి పథకం ద్వారా చెక్‌డ్యాంలు మంజూరు చేస్తామని, అర్హులకు పింఛన్లు, గ్రామంలో డ్వాక్రా సంఘానికి పçసుపు కుంకుమ డబ్బులతో పాటుగా బ్యాంకు రుణాలు అందే విధంగా సంబంధిత ఉన్నతాధికారులకు నివేదిక అందిస్తానని వివరించారు. ఎంపీడీవోతో పాటు డివిజన్ సర్పంచ్ల ఫోరం ఉపాధ్యక్షుడు పాంగి సింహాచలం పంచాయతీ కార్యదర్శులు నాగేశ్వరరావు, కాంతరాజు గ్రామస్తులు పాల్గొన్నారు. -
రెండు నిమిషాలకే జన్మభూమి వాయిదా..
రొంపిచర్ల: జన్మభూమి కార్యక్రమంలో పాల్గొనడానికి వస్తున్న ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ గ్రామస్తులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అధికారికి ఆగ్రహం తెప్పించింది. దీంతో రెండు నిమిషాలకే జన్మభూమి కార్యక్రమాన్ని వాయిదా వేశారు. గుంటూరు జిల్లా రొంపిచర్ల మండలం విపర్లరెడ్డి పాలెం గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. జన్మభూమి కార్యక్రమం సందర్భంగా గ్రామస్తులు తమ ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై ఎండీవో మండిపడ్డాడు. ఫ్లెక్సీని తొలగిస్తేనే జన్మభూమి కార్యక్రమం జరుపుతానని తేల్చి చేప్పాడు. కాగా, ఎండీవో తీరుపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానం కొద్ది గ్రామస్తులు ఫ్లెక్సీని ఏర్పాటు చేస్తే.. దాని గురించి ప్రజాసమస్యలను పరిష్కరించే కార్యక్రమాన్ని ఆపడమేంటని ప్రశ్నించారు. దీంతో జన్మభూమి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎండీవో తిరిగి రెండు నిమిషాలకే వాయిదా వేశారు. -
‘ఉపాధి’కి ఊతం వచ్చేనా!
* ఈజీఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లుగా ఎంపీడీఓలు * వందరోజుల పని లక్ష్యంగా.. * మండల స్థాయిలో చురుకైన పాత్ర పోషించాలి * ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఉపాధి హామీ పథకం అమలు బాధ్యతలను మండల పరిషత్ అభివృద్ధి అధికారుల(ఎంపీడీఓ)కు బదలాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పథకం విజయవంతం కోసం గ్రామ, మండల స్థాయి ల్లో ఇకపై ఎంపీడీఓలు చురుకైన పాత్ర పోషిం చాలని ఉత్తర్వుల్లో పేర్కొన్న సర్కారు.. ఈవోపీఆర్డీ, సూపరింటెండెంట్ సహా 11 కేటగిరిలకు చెందిన అధికారులు, ఉద్యోగుల విధి విధానాలను కూడా అందులో సూచించింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలోని 9 జిల్లాలు, 443 మండలాల్లో జాబ్‌కార్డున్న ప్రతికూలీకి కనీ సం 100 రోజుల పని లక్ష్యంగా నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి జె.రేమండ్ పీటర్ శుక్రవారం కలెక్టర్, జడ్పీ సీఈఓ, డ్వామా పీడీలకు జారీ చేసిన ఉత్తర్వులో పేర్కొన్నారు. ఇక జిల్లాలోని 36 మండలాలకు ఎంపీడీఓలే ‘ఉపాధి’ ప్రోగ్రాం ఆఫీసర్లుగా వ్యవహరించనున్నారు. కూలీలకు భరోసా ఇవ్వని పథకం ఉపాధి హామీ చట్టం-2005 ప్రకారం జిల్లాలో నమోదు చేసుకున్న కూలీలకు కనీసం వంద రోజుల పాటు పని కల్పించాల్సి ఉంది. అయితే అధికారులు లక్ష్యసాధనకు అనేక ప్రతికూల పరిస్థితులను కారణాలుగా చూపుతూ కూలీల కు వందరోజులు పని కల్పించలేకపోయారు. ఉ పాధి హామీ పథకం అమలులో రాష్ట్రస్థాయిలో జిల్లా ఐదో స్థానంలో ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నా.. గతేడాది 14,578 కుటుంబాలకే వంద రోజుల పని దొరకడం గమనార్హం. ఈ నేపథ్యం లో ఉపాధి హామీతో భరోసా పొందని కూలీలు మళ్లీ వలసబాట పట్టిన సందర్భాలున్నాయి. మద్నూర్, పిట్లం, జుక్కల్, నిజాంసాగర్, కోట గిరి, బాన్సువాడ తదితర మండలాల్లో పలువురు కూలీలు వలస వెళ్లారు. చిత్తశుద్ధి ఏది? ఉపాధి హామీ పథకం కింద ఖర్చు చేసేందుకు బోలెడన్ని నిధులున్నా.. క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ, పనుల ఎంపిక, కూలీలకు పని కల్పించే విషయంలో చాలాచోట్ల చిత్తశుద్ధి కరువైందన్న విమర్శలున్నాయి. 2013-14 సంవత్సరంలో జాబ్‌కార్డులు పొందిన 4,45,117 మంది కూలీలకు ఉపాధి కల్పించేందుకు రూ. 557.62 కోట్ల విలువ గల పనులు గుర్తించినా.. రూ. 203.50 కోట్లు ఖర్చు చేసి 50,149 పనులు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అయినా కేవలం 14,578 కుటుంబాలకు మాత్రమే వంద రోజుల పని కల్పించగలిగారు. శుక్రవారం నాటికి ఉపాధి హామీలో పాల్గొన్న కూలీకి రోజుకు సగటున రూ. 108.54 లకు మించి కూలి డబ్బులు లభించలేదు. ప్రణాళిక ఇదీ.. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రూ. 881.34 కోట్లతో 53,690 పనులు చేపట్టేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 4,48,001 మంది కూలీలకు జాబ్‌కార్డులు అందజేసిన అధికారులు 25,669 శ్రమ శక్తి సంఘాల ద్వారా 6,26,495 మందికి ఉపాధి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. కూలీలకు ఉపాధి కల్పించడం ద్వారా రూ. 557.62 కోట్లు ఖర్చు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైనా.. అందులో ఇప్పటికే 20,801 పనులు పూర్తి చేసి రూ. 129.92 కోట్లు ఖర్చు చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. అయితే పథకం అమలు కోసం ప్రణాళికలు బాగానే ఉన్నా... క్షేత్రస్థాయిలో ఆచరించడం మాత్రం సాధ్యం కావడం లేదు. ఇదిలా ఉంటే ఇప్పటికీ 45 శాతం గ్రామాలలో ఉపాధి పనులు ఇంకా మొదలవలేదు. శివారు గ్రామాల్లోనైతే ఉపాధి హామీ పనులను మొక్కుబడిగా ప్రారంభించారు. 2012-13 ఆర్థిక సంవత్సరంలోనూ జనవరి, ఫిబ్రవరి మాసాల వరకు నిధులను ఖర్చు చేయకుండా మార్చిలో హడావుడి చేశారన్న ఆరోపణలున్నాయి. అయితే కొత్తగా కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల మేరకు ఉపాధి హామీ పథకం పనుల పర్యవేక్షణ పూర్తిస్థాయి బాధ్యతలను ఎంపీడీఓలకు అప్పగించనుండగా.. 2015- 16 ప్రణాళికతో పాటు ప్రస్తుతం నడుస్తున్న పనుల విషయంలో ఏ విధంగా వ్యవహరిస్తారనే అంశం చర్చనీయాంశంగా మారింది. ప్రోగ్రాం ఆఫీసర్లుగా అవతారమెత్తనున్న ఎంపీడీఓలు.. కూలీలకు ఏ విధంగా భరోసా కల్పిస్తారో వేచి చూడాలి. -
త్రిశంఖు స్వర్గంలో తహశీల్దార్లు
- జిల్లాకు తిరిగొచ్చిన 32 మంది.. - వారం గడిచినా దక్కని పోస్టింగ్‌లు - రాజకీయ జోక్యంపై సర్వత్రా ఆసక్తి సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : తహశీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో రాజకీయ జోక్యంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఇతర జిల్లాలకు వెళ్లి.. తిరిగి జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు వారం రోజులు గడుస్తున్నా పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఈ పోస్టింగ్‌లలో జిల్లా మంత్రి జోగు రామన్నతోపాటు, ఎమ్మెల్యేల ప్రమేయం తప్పకుండా ఉంటుందనే అభిప్రాయం ఎన్నికల సందర్భంగా జిల్లాలో వివిధ చోట్ల పనిచేస్తున్న 54 మంది తహశీల్దార్లు కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికలు ముగిసిన వెం టనే జిల్లా నుంచి వెళ్లిన ఈ తహశీల్దార్లలో 40 మంది తిరిగి జిల్లాకు వచ్చారు. వీరిలో ఎక్కువ మంది ఈనెల 12నుంచి 16వరకు కలెక్టరేట్లో రిపోర్టు చేశారు. వారం రోజులు దాటుతున్నప్పటికీ వీరిలో ఎవ్వరికి పోస్టింగ్‌లు ఇవ్వకపోవడం చర్చకు దారితీస్తోంది. ఖాళీగా ఉన్న మండలాల్లో డిప్యూటీ తహశీల్దార్లను ఇన్‌చార్జీలుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన కలెక్టర్.. వీరికి మాత్రం ఇంకా పోస్టింగ్‌లు ఇవ్వలేదు. అలాగే ఎన్నికల సందర్భంగా వరంగల్, కరీంనగర్, ఖమ్మంల నుంచి 41 మంది తహశీల్దార్లు జిల్లాకు వచ్చారు. వీరికి ఇటీవల వారు తిరిగి సొంత జిల్లాలకు బదిలీ అయింది. ఇందులో 31 మంది తహశీల్దార్లు రిలీవ్ అయ్యారు. మిగిలిన పది మందిని ఎన్నికల లెక్కలు సమర్పించాల్సి ఉందని కలెక్టర్ రిలీవ్ చేయలేదు. ప్రస్తుతం జిల్లాలో 31 మంది తహశీల్దార్ల పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ జిల్లాకు వచ్చిన తహశీల్దార్లకు పోస్టింగ్‌లు కేటాయించలేదు. ఈ ఫైలు ప్రస్తుతం కలెక్టర్ పరిశీలనలో ఉంది.ఒకటీ రెండు రోజుల్లో ఈ ఫైలుపై నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని కలెక్టరేట్ వర్గాలు పేర్కొంటున్నాయి. జిల్లాలో మంచిర్యాల, ఆదిలాబాద్, భైంసా, నిర్మల్, కాగజ్‌నగర్, బెల్లంపల్లి మండలాల్లో పనిచేసేందుకు తహశీల్దార్లు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. పాత స్థలాలకు ఎంపీడీఓలు.. : ఈసారి ఎన్నికల సందర్భంగా ఎంపీడీవోలకు కూడా బదిలీలు అయ్యాయి. జిల్లా నుంచి 16 మంది ఎంపీడీవోలు వివిధ జిల్లాలకు బదిలీ అయ్యారు. ఎన్నికల అనంతరం వీరిలో 13 మంది తిరిగి జిల్లాకు వచ్చారు. వీరు గతంలో ఎక్కడైతే పనిచేశారో.. అదే పోస్టుల్లో వీరిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తహశీల్దార్ల పోస్టింగ్‌ల విషయంలో మాత్రం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పోస్టింగ్‌లు ఇచ్చే అధికారం జిల్లా కలెక్టర్‌కు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో తహశీల్దార్లను పోస్టింగ్‌ల విషయంలో కలెక్టర్ల నిర్ణయమే కీలకం అవుతోంది. -
విజ్ఞాపనలు వినేవారేరీ?
సాక్షిప్రతినిధి, నల్లగొండ : గత ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి సోమవారం (23వ తేదీ) నాటికి జిల్లాలోని 177 ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజల నుంచి స్వీకరించిన వినతులు 9442. కాగా, వీటిలో 7772 విజ్ఞాపనలను పరిష్కరించగా ఇంకా, 1670 విజ్ఞప్తులు పెండింగులోనే ఉన్నాయి. ఈ గణాంకాలను చూస్తే మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల దాకా బాగా పనిచేస్తున్నారనే భ్రమ కలగవచ్చు. కానీ, జిల్లా కేంద్రంలోని ప్రధాన కార్యాయాలు, కలెక్టరేట్ మాత్రమే భేష్‌గా పనిచేస్తున్నాయి. ఆర్డీఓ, ఇతర డివిజనల్, మండల కార్యాలయాల పనితీరు అధ్వానంగా ఉంది. చివరకు ఈ ఆఫీసుల్లో పనిచేసే అధికారులు, సిబ్బందిలో మెజారిటీ సోమవారం రోజైనా సకాలంలో విధులకు హాజరు కావడం లేదు. ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఫలితంగా ఏడాదిన్నర కాలంలో 98శాతం ప్రజలు తహసీల్దారు, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళ్లడం లేదు. వినతిపత్రాలు ఇవ్వడం లేదు. నల్లగొండ తహసీల్దార్ కార్యాలయం మినహా రెండంకెల సంఖ్యలో వినతిపత్రాలు అందుకున్న మండల కార్యాలయాలు పట్టుమని పది కూడా లేవు. అత్యధిక ఆఫీసుల్లో ఒకటీ, రెండు చొప్పున మాత్రమే వినతులు అందాయి. కాగా, జిల్లాకేంద్రంలోని ఆయా ఆఫీసుల్లో మాత్రం ఈ సంఖ్య ఎక్కువగా ఉంది. మండల అధికారులపై నమ్మకం కోల్పోయిన ప్రజలు చిన్న పనికోసం కూడా ఎక్కడో మారుమూల గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వ్యయ ప్రయాసాలకోర్చి వస్తున్నారు. సోమవారం జిల్లా వ్యా ప్తంగా అన్ని మండలాలు, పట్టణాల్లో ప్రజా విజ్ఞప్తుల రోజు ఏవిధంగా నడుస్తుందో తెలుసుకునేందుకు ‘సాక్షి’ ప్రయత్నించింది. అధికారులు సకాలంలో హాజరు కాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడిన దృశ్యం ఆవిష్కృతమైంది.జిల్లాలో అత్యధికంగా పౌరసరఫరాల శాఖ (953), హౌసింగ్ (647), ఎస్సీ కార్పొరేషన్ (585), జిల్లా పంచాయతీ అధికారి (355), నల్లగొండ తహసీల్దార్ (343) కార్యాలయాలు అధిక సంఖ్యలో ప్రజల నుంచి ఆయా పనుల కోసం వినతిపత్రాలు అందుకున్నాయి. తమకు ప్రజల నుంచి అందిన విజ్ఞాపనలను పట్టించుకోని జిల్లా కార్యాలయాలు వరుసగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, లేబర్ కమిషనర్, పులిచింతల స్పెషల్ కలెక్టర్, జిల్లా రిజిష్ట్రార్, సోషల్ ఫారెస్టు డిపార్టుమెంట్లు మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. కిందిస్థాయిలో విజ్ఞప్తులను పరష్కరించడంలో కోదాడ మున్సిపాలిటీ, డిండి తహసీల్దార్, హాలియా ఎంపీడీఓ కార్యాలయాలు పూర్తిగా వెనుకబడ్డాయి. నేరెడుచర్ల ఎంపీడీఓ, బొమ్మలరామారం తహసీల్దార్ కార్యాలయాలు నూరుశాతం ప్రజావిజ్ఞప్తులను పరిష్కరించాయి.నల్లగొండ : నల్లగొండ నియోజకవర్గంలోని తిప్పర్తి, కనగల్, నల్లగొండ మండలంలో గ్రీవెన్స్ డే అమలుకు నోచుకోవడం లేదు. సోమవారం ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లో అధికారులు తప్పా మిగతా శాఖలకు సంబంధించిన అధికారులు ఎవరూ హాజరుకాలేదు. తిప్పర్తి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులంతా ఉన్నారు. సూర్యాపేట : సూర్యాపేట మున్సిపాలిటీలో 11గంటల వరకు టౌన్ ప్లానింగ్ అధికారి విధులకు హాజరుకాలేదు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్, డీఈలు 12గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో కూడా మున్సిపల్ ఆర్ఓ కార్యాలయ తాళం తీయలేదు. సూర్యాపేట మండలంలో ఎంఈఓ, ఎంపీడీఓ, ఏపీఓ, ఏపీఎం కార్యాలయాల్లో అధికారులు అందుబాటులో లేరు. పెన్‌పహాడ్ వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు కూడా ఏఓ, ఏఈఓలు ఎవరూ హాజరు కాలేదు. తహసీల్దార్ కార్యాలయంలో ఏఎస్ఓ కూడా కార్యాలయానికి సాయంత్రం వరకు కూడా హాజరుకాలేదు. చివ్వెంల ఎంపీడీఓ కార్యాలయంలో ఈఓఆర్డీ కుర్చీ ఖాళీగా కనిపించింది. కాగా ఈఓఆర్డీ బ్యాంకు పని నిమిత్తం సూర్యాపేటకు వెళ్లినట్లు ఎంపీడీఓ ఎం.సాంబశివరావు తెలి పారు. ఆత్మకూర్.ఎస్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ ఒక్కరే విధుల్లో ఉన్నారు.. మిర్యాలగూడ : మిర్యాలగూడ మున్సిపాలిటీలో మున్సిపల్ పింఛన్ల పంపిణీ అధికారి 10.50 గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజినీర్ 11 గంటల వరకు కూడా కార్యాలయానికి రాలేదు. ట్రాన్స్‌కో టౌన్-2, రూరల్ కార్యాలయాల తలుపులు మధ్యాహ్నం 12:30 గంటల వరకు కూడా తెరుచుకోలేదు. వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఉదయం 10:56 గంటలకు కూడా ఏడీ ఏ, ఏఓ, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ రాలేదు. వేములపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐలు, ఏఎస్ఓలు ఉదయం 11గంటల వరకు కార్యాలయానికి రాలేదు. వ్యవసాయశాఖ కార్యాలయంలో 11 గంటల వరకు ఏఓ రాలేదు. దేవరకొండ : చింతపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని 11గంటల సమయంలో సందర్శించినప్పుడు తహసీల్దార్ అందుబాటులో లేరు. తహసీల్దార్ పుష్పలత పెట్రోల్ బంకు తనిఖీకి వెళ్లినట్లు తర్వాత ‘ సాక్షి ’కి సమాచారం అందించారు. ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్లు మినహా ఏ ఒక్క అధికారి కూడా 11 గంటల వరకు హాజరు కాలేదు. దేవరకొండలో పశువైద్యశాల ఉదయం 12గంటల సమయంలో తాళం వేసే ఉంది. ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసులో డీఈఈ రూము తలుపులు తెరవకుండా కనిపించగా, దేవరకొండ ఆర్డబ్ల్యూఎస్ ఏఈ అందుబాటులో లేరు. హాలియా : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో అధికారులు ఉదయం 10.30 గంటల తరువాతే విధులకు హాజరయ్యారు. అనుముల తహసీల్దార్ ఉదయం 12.30గంటల వరకూ కార్యాలయానికి రాలేదు. మండలంలో పలు గ్రామాల్లో ఇసుక డంపులను సీజ్ చేసేందుకు వెళ్లడంతో ఆసల్యమైనట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. పెద్దవూర మండలంలో మండల డిప్యూటీ తహసీల్దార్, ఎంపీడీఓలు 10.45 తర్వాతే హాజరుకాగా, మండల వైద్యాధికారిఱి 10.50కి, సీడీపీఓ 11.05 నిమిషాలకు, మండల పశువైద్యాధికారి 11.00 గంటలకు విధులకు హాజరయ్యారు. నిడమనూరు మండలంలో ఉదయం 11గంటల వరకు తహసీల్దార్ గానీ, ఎంపీడీఓ గానీ విధులకు హాజరుకాలేదు. సీనియర్ అసిస్టెంట్ 11 గంటల తర్వాతే విధులకు వచ్చారు. కోదాడ : నియోజకవర్గంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు సిబ్బంది సకాలంలో హాజరుకాలేదు. పట్టణంలో ఉన్న కార్యాలయాలకు ఉదయం 11గంటల తరువాతే అధికారులు వచ్చారు. కోదాడ వ్యవసాయశాఖ, మండల రెవెన్యూ కార్యాలయం, గృహనిర్మాణశాఖ కార్యాలయంలో అధికారులు 10.50 గంటల తరువాతే వచ్చారు. మునగాల తహసీల్దార్, వ్యవసాయశాఖ అధికారులు 11 గంటలకు వచ్చారు. నడిగూడెం తహసీల్దార్, మండల పరిషత్, గృహనిర్మాణ శాఖ అధికారులు 10.45 గంటలకు కార్యాలయాలకు చేరుకున్నారు. మోతె మండల కేంద్రంలో కూడా అధికారులు 11 గంటలు నుంచి 11.30 మధ్య కార్యాలయాలకు చేరుకున్నారు. నకిరేకల్ : నకిరేకల్‌లో పంచాయతీ రాజ్ డీఈ, ఐసీడీఎస్‌లో ఒక అటెండర్ మినహా మిగతా అధికారులెవరూ హాజరుకాలేదు. వ్యవసాయ శాఖ ఏడీఏ, తహసీల్దార్ కార్యాలయాలకు కూడా అధికారులు సమయానికి హాజరుకాలేదు. రామన్నపేటలోని ఎంపీడీఓ, తహసిల్దార్, ఐసీడీఎస్, రిజిస్ట్రేషన్, ఉపాధి, వెలుగు కార్యాలయాల్లో ఉదయం 11గంటలలోపు ఉద్యోగుల హాజరు చాలా పలుచగా ఉంది. కట్టంగూర్, కేతేపల్లి మండలంలో వివిధ శాఖల అధికారులు సమయానికి విధులకు హాజరు కాకపోవడంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. హుజూర్నగర్ : హుజూర్‌నగర్‌లో ఐసీడీఎస్ కార్యాలయంలో ఉదయం 11 గంటల వరకు సీడీపీఓ విధులకు హాజరుకాలేదు. గరిడేపల్లిలోని మండల పరిషత్ కార్యాలయంలో సూపరింటెండెంట్, ఈఓఆర్డీ, పంచాయతీ రాజ్ ఏఈ, ఆర్డబ్ల్యూఎస్ ఏఈలెవరూ విధులకు హాజరుకాలేదు. గరిడేపల్లి పశువైద్యశాలకు తాళం వేసి ఉంది. హౌసింగ్ కార్యాలయంలో ఏఈ విధులకు హాజరుకాలేదు. ఆలేరు : వినతులతో వచ్చిన వారికి ఆలేరులో అధికారులు అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగారు. గుండాల మం డలంలో 11 గంటల దాకా ఎంపీడీఓ కార్యాల య తాళం తీయలేదు. యాదగిరిగుట్టలో మం డలపరిషత్ అధికారులు, సిబ్బంది కార్యాలయానికి ఉదయం 11 గంటల వరకు హాజరు కాలే దు. ఎంపీడీఓ రఘురాం సెలవులో ఉన్నట్లు తెలి పారు. ఆత్మకూర్(ఎం) మండలంలో రెవెన్యూ అధికారులు 11 గంటల వరకూరాలేదు. భువనగిరి : భువనగిరి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ సరస్వతి మధ్యాహ్నం 12.20 కార్యాలయానికి వచ్చారు. ఈఓ, పీఆర్డీ వెంకటనర్సయ్య 11.20కు విధులకు వచ్చారు. బీబీనగర్ రెవెన్యూ అధికారి ఉద యం 11 గంటలకు కార్యాలయానికి వచ్చారు. తిరుమలగిరి : తుంగతుర్తి నియోజకవర్గంలో అధికారులెవరూ మండల హెడ్ క్వార్టర్లో ఉండకపోవడంతో కార్యాలయాలకు ఆలస్యంగా వస్తున్నారు. తిరుమలగిరి తహసీల్దార్ 11.10గంటలకు విధులకు హాజరయ్యారు. ఆయా మండలాల్లో బీఆర్జీఎఫ్ గ్రామ సభలు నడుపుతుండడంతో అధికారులు వివిధ గ్రామాలకు వెళ్లారు.