తోట్లవల్లూరు : కృష్ణా జల్లా తోట్లవల్లూరు మండలంలోని పాములలంకలో బుధవారం జన్మభూమి కార్యక్రమాన్ని సాక్షాత్తూ టీడీపీ గ్రామ సర్పంచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామస్తులు అడ్డుకున్నారు. కృష్ణానదిపై వంతెన నిర్మించాలని కోరుతూ జన్మభూమి కార్యక్రమాన్ని బహిష్కరించారు. తోట్లవల్లూరు, పాములలంక మధ్య బ్రిడ్జి నిర్మాణానికి రూ.13.5 కోట్లు మంజూరు చేశారు. శంకుస్థాపన చేసి ఏడాదయినా ఇంతవరకూ పనులు మొదలు కాలేదు. వెంటనే పనులు ప్రారంభించాలని కోరుతూ గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు.