
'ఎన్నికల కోడ్ ఉంటే నాకేంటి'
చిత్తూరు: శ్రీకాళహస్తిలో అటవీశాఖ మంత్రి బొజ్జలగోపాల కృష్ణారెడ్డి సతీమణి మరోసారి హల్ చల్ చేశారు. ఆమె సోమవారం తన బృందంతో కలిసి శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించారు. తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందని అధికారులు తెలియజేసినా ఆమె వారి మాట పట్టించుకోకుండా తనిఖీలు నిర్వహించారు. ఈ పరిణామాలు చూసి ఆశ్చర్యపోవడం అధికారుల వంతైంది.