శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశాలు, ప్రభుత్వ కళాశాలలో పుస్తకావిష్కరణల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది.
ఆ మేరకు వుంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయూల్లో అధికారిక కార్యక్రవూలు నిర్వహించరాదు. రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రం బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పట్టణంలోని రాజీవ్‌నగర్‌లోని ప్రభుత్వ గిరిజన కళాశాలలో నిర్వహించిన యానాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి విద్యాహక్కు చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు.
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి బొజ్జల
Published Thu, Jan 29 2015 1:35 AM | Last Updated on Wed, Apr 3 2019 5:55 PM
Advertisement
Advertisement