tirupati assembly
-
తిరుపతి ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి
తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానానికి శుక్రవారం జరిగే ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఎన్నికల సిబ్బందికి ఈవీఎం బాక్సులను అందజేశారు. మొత్తం 265 కేంద్రాలున్న తిరుపతి అసెంబ్లీకి భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.1800 మంది పోలీసులను అక్కడికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రతీ పోలింగ్ కేంద్రంలోను వెబ్ కెమెరాలను అమర్చారు. ఈ ఎన్నికల ఫలితాలను ఈనెల 16 న ప్రకటించనున్నారు. తిరుపతి ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గతేఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. -
ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన మంత్రి బొజ్జల
శ్రీకాళహస్తి: చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. మున్సిపల్ కార్యాలయంలో సమావేశాలు, ప్రభుత్వ కళాశాలలో పుస్తకావిష్కరణల్లో ఆయన పాల్గొన్నారు. తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నేపథ్యంలో చిత్తూరు జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఆ మేరకు వుంత్రులు, ఎమ్మెల్యేలు ప్రభుత్వ కార్యాలయూల్లో అధికారిక కార్యక్రవూలు నిర్వహించరాదు. రాష్ట్ర అటవీ శాఖమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మాత్రం బుధవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో అధికారులు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత పట్టణంలోని రాజీవ్‌నగర్‌లోని ప్రభుత్వ గిరిజన కళాశాలలో నిర్వహించిన యానాదుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి విద్యాహక్కు చట్టం పుస్తకాన్ని ఆవిష్కరించారు. -
ఫిబ్రవరి 13 న తిరుపతి ఉప ఎన్నికలు
తిరుపతి : తిరుపతి అసెంబ్లీ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి వి.ఎస్. సంపత్ షెడ్యూల్ విడుదల చేశారు. ఎన్నికలు ఫిబ్రవరి 13 న తేదిన నిర్వహించి, ఫలితాలు 16 వతేదిన ప్రకటిస్తారు. నోటిఫికేషన్- జనవరి 19 నామినేషన్లకు చివరి తేదీ- జనవరి 27 నామినేషన్ల ఉపసంహరణ- జనవరి 30 ఎన్నికలు- ఫిబ్రవరి 13 కౌంటింగ్- ఫిబ్రవరి 16 తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గతేఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి