తిరుపతి: తిరుపతి అసెంబ్లీ స్థానానికి శుక్రవారం జరిగే ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగానే ఎన్నికల సిబ్బందికి ఈవీఎం బాక్సులను అందజేశారు. మొత్తం 265 కేంద్రాలున్న తిరుపతి అసెంబ్లీకి భారీ బందో బస్తును ఏర్పాటు చేశారు.1800 మంది పోలీసులను అక్కడికి తరలించారు. ఇదిలా ఉండగా ప్రతీ పోలింగ్ కేంద్రంలోను వెబ్ కెమెరాలను అమర్చారు.
ఈ ఎన్నికల ఫలితాలను ఈనెల 16 న ప్రకటించనున్నారు. తిరుపతి ఎమ్మెల్యే మన్నేరు వెంకటరమణ గతేఏడాది అనారోగ్యంతో మృతి చెందడంతో ఆ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి.