సొంత జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదరణ కరువవుతోంది.
శ్రీకాళహస్తి: సొంత జిల్లా చిత్తూరులో ఎన్నికల ప్రచారం చేస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆదరణ కరువవుతోంది. ఆయన ప్రసంగాలు వినేందుకు ప్రజలు ఆసక్తి చూపడం లేదు. టీడీపీ అధినేత ఎన్నికల ప్రచారం ఆశించిన స్థాయిలో సాగడం లేదు.
మంగళవారం శ్రీకాళహస్తిలో చంద్రబాబు నిర్వహించిన రోడ్ షో జనం లేక వెలవెలబోయింది. దీంతో స్థానిక నేతలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. సరైన మైకు కూడా ఏర్పాటు చేయలేకపోయారంటూ శ్రీకాళహస్తి అసెంబ్లీ బొజ్జల గోపాలకృష్ణ రెడ్డిపై బహిరంగంగా మండిపడ్డారు. చంద్రబాబు తన పర్యటనలో అసంతృప్తులను బుజ్జగించేందుకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నట్టు కనబడుతోంది.