
బొజ్జల అనుచరుడి 'సెల్ చల్'
చిత్తూరు: గుడి, బడి అనే తేడా లేకుండా తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ పార్టీ అధికారంలో ఉందన్న అహంకారంతో ఎక్కడబడితే అక్కడ చెలరేగుతున్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తిలో మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనుచరుడు రాంబాబు సోమవారం 'సెల్ చల్' చేశాడు.
భక్తులందరూ బుద్ధిగా వరుసలో నిల్చుంటే రాంబాబు మాత్రం తన సెల్ ఫోన్ తో ఆలయం ఫోటోలు తీస్తూ హడావుడి చేశాడు. ఆలయ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేయడంతో వాగ్వాదానికి దిగాడు. రాంబాబు వైఖరితో భక్తులు ఇబ్బందులు పడ్డారు. పవిత్రస్థలంలో ఇవేం పనులంటూ భక్తులు తిట్టుకున్నారు.