
ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై 15న నిర్ణయం
శ్రీకాళహస్తి: మంత్రివర్గం నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను కేబినెట్ నుంచి తొలగించడం చాలా బాధగా ఉందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై ఈ నెల 15న తుది నిర్ణయం తీసుకుంటానన్నారు.
కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని ఆయన తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, అయితే ఈ కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఈ చర‍్యకు బాధపడే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని మీడియకు తెలియచేస్తానని బొజ్జల తెలిపారు.