mla post
-
ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం.. 24 గంటల్లోనే రాజీనామా ఎందుకంటే?
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి రాయ్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక, కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్ ఎంఎన్ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.అయితే, కృష్ణ కుమారి రాయ్ రాజీనామాపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sikkim Chief Minister Prem Singh Tamang’s wife Krishna Kumari Rai resigns as MLA,a day after taking oath. pic.twitter.com/asimdk98Uh— KGFChandra (@FieldsKolar) June 13, 2024 -
మునుగోడు కోసమే నా రాజీనామా: రాజగోపాల్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఉపఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్ అభివృద్ధి మంత్రం జపిస్తున్నారని, అందుకే తాను రాజీనామా వైపు అడుగు వేశానని కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన. మునుగోడు ఎమ్మెల్యే హోదాలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చివరిసారిగా మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజకవర్గం గురించి.. గత పది పన్నెండు రోజులుగా మీడియాలో విపరీతంగా చర్చ నడుస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో రాజీనామాపై చర్చ జరుగుతోంది. దీంతో నా రాజీనామాపై చర్చ పక్కదారి పట్టింది. నా గురించి కొందరు తప్పుగా మాట్లాడుతున్నారు. అయినా రాజీనామాపై నాన్చే ఉద్దేశం నాకు లేదు. మునుగోడు ప్రజల నిర్ణయం మేరకే నా నిర్ణయం ఉంటుంది. మునుగోడులో అసలు అభివృద్ధి లేదు. ఇచ్చిన ఏ ఒక్క హామీని ప్రభుత్వం నెరవేర్చలేదు. కనీసం ప్రతిపక్ష ఎమ్మెల్యే హోదాలో కూడా నాకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు. పోడు భూముల సమస్యలపై ప్రభుత్వం ఇంతవరకూ ఏమీ చేయలేదు. గిరిజనులను అధికారులు వేధిస్తున్నారు. పోడు భూములకు పాస్ బుక్‌లు ఇప్పించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. ఉప ఎన్నికలు వస్తేనే ఈ ప్రభుత్వం అభివృద్ధి గురించి ఆలోచిస్తోంది.. చేస్తోందని ఆయన అన్నారు. ఇచ్చిన హామీలు నెరవేరిస్తే ఎమ్మెల్యే పదవి త్యాగం చేసి.. టీఆర్ఎస్ అభ్యర్థినే తాను గెలిపిస్తానని టీఆర్ఎస్కు చెప్పానని, అయినా ఎటువంటి పురోగతి లేదని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం బలహీనపడడం కూడా తన రాజీనామాకు ఓ కారణమని ఆయన అన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన తనను మునుగోడు ప్రజలు ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపించారని, కానీ, నియోజకవర్గానికి ఏం చేయలేకపోయానన్న అసంతృప్తి తనలో పేరుకుపోయిందని చెప్పారాయన. రాజీనామా చేస్తేనే ఇక్కడ అభివృద్ధి, కనీస వసతులైనా కలగవచ్చని ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. కోమటిరెడ్డి బ్రదర్స్ నిజాయితీతో కూడిన రాజకీయాలకు కేరాఫ్ అని.. పదవులు, కాంట్రాక్టులు కావాలనుకుంటే టీఆర్ఎస్ నుంచి వచ్చిన ఆఫర్‌ను తీసుకుని బాగుపడేవాళ్లమని ఆయన అన్నారు. -
Etela Rajender: ఈటలకు షాకిచ్చేందుకు ‘కెప్టెన్’ రెడీ!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురై రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తదుపరి అడుగులపై స్పష్టత రావడం లేదు. రెండ్రోజులు హుజూరాబాద్‌లోనే మకాం వేసిన ఆయన.. సన్నిహితులు, శ్రేయోభిలాషులతో సుదీ ర్ఘంగా చర్చించారు. బుధవారం తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. టీఆర్ఎస్ తనను వదిలించుకోవాలనే నిర్ణయించుకున్నట్లు ఇప్పటికే స్పష్టత రావడంతో.. ఆచితూచి అడుగులు వేయాలని ఈటల భావిస్తున్నారు. అధినేత కేసీఆర్‌తో అత్యంత సన్నిహితంగా మెదిలిన నేత ఈటల. అందుకే.. ఆవేశంతో కాకుండా ఆలోచనతోనే టీఆర్ఎస్ అధిష్టానాన్ని ఎదుర్కోవాలని ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లుగా తెలు స్తోంది.‘పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా.. వేరే పార్టీ ల్లో చేరిక.. సొంత పార్టీ స్థాపన’ అనే అంశాలపై మేథోమధనం చేస్తున్నారు. బలమైన శత్రువును ఎదుర్కోవలసి వ చ్చినప్పుడు అన్నివిధాల సమాయత్తమై అడుగులు వేయాల్సి ఉంటుందని తన సన్నిహితులతో జరిపే సంభాషణల్లో వ్యాఖ్యానించడం గమనార్హం. అదే సమయంలో టీఆర్ఎస్ ఈటలపై దాడిని పెంచింది. ఆయన స్వయంగా పార్టీని వదిలి పోయేలా పథకాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ సస్పెండ్ చేసే వరకూ ఇదే ధోరణి.. టీఆర్ఎస్తో సుమారు 20 ఏళ్ల అనుబంధాన్ని నైతి కంగా ఇప్పటికే తెంచుకున్నప్పటికీ, సాంకేతికంగా ఈటల రాజేందర్ అధికార పార్టీ ఎమ్మెల్యేనే. మెదక్ జిల్లాలోని పౌల్ట్రీ పరిశ్రమకు చెందిన భూముల వ్యవహారంలో దోషిగా చూపించి మంత్రివర్గం నుంచి అవమానకర రీతిలో తొలగించారని భావించిన ఆయన హుజూరాబాద్‌కు వెళ్లిన తరువాత తన సన్నిహితులతో చర్చించి పార్టీకి, పదవికి రాజీనా మా చేస్తారని ప్రచారం జరిగింది. ఆయన మాత్రం ‘హైదరాబాద్ వెళ్లిన తరువాత’ నిర్ణయం ప్రకటిస్తానని చెప్పారు. అయితే.. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్షం ఊసు లేకుండా అన్ని ఎన్నికల్లో విజయాలు సాధిస్తున్న తీరు, పార్టీ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాలు.. ఇవన్నీ తెలిసిన ఈటల తొందరపాటు నిర్ణయం తీసుకోకూడదని నిర్ణయించుకున్నట్లు సమాచారం. మంత్రి వర్గం నుంచి తొలగించిన నేపథ్యంలో తనకు తానుగా పార్టీకి రాజీనామా చేస్తే.. ఎమ్మెల్యే పదవిని కూడా వదులుకోవలసిన అనివార్య పరిస్థితులు తలెత్తుతాయి. కొత్తగా పార్టీ స్థాపించినా, వేరే ఏ పార్టీలోకి వెళ్లినా పార్టీ ఫిరాయింపుల చట్టం కింద గెలిచిన ఎమ్మెల్యే పదవిని కోల్పోవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధిష్టానమే పార్టీ నుంచి సస్పెండ్ చేసే పరిస్థితి కల్పించాలని ఈటల భావిస్తున్నట్లు సమాచారం. ఈలోగా తనపై వచ్చిన మాసాయిపేట భూకబ్జా, దేవరయాంజల్ దేవుడి భూముల ఆక్రమణ వంటి ఆరోపణలు నిజం కాదని కోర్టు ద్వారా నిరూపించుకునే పనిలో ఉన్నారు. ఆచితూచి అడుగులు మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించారనే సానుభూతి జనాల్లోకి వెళ్లిందని భావిస్తున్న ఈటల వర్గం ఇదే ఊపును కొనసాగించాలని భావిస్తోంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటలకు ప్రజలతో ఉన్న సంబంధాల వల్ల స్థానికంగా ఆయనకు వచ్చే ఇబ్బందులేమీ లేవు. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇమేజ్ను పెంచుకునే దిశగా ఈటల రాజేందర్ అడుగులు వేస్తున్నట్లు ఇంటలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి నివేదిక పంపాయి. రాష్ట్రంలోని ముదిరాజ్ సామాజిక వర్గం అండ ఉందని భావిస్తున్న ఆయన ఇతర బీసీ సంఘాల నుంచి పూర్తిస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు పావులు కదుపుతున్నారు. అదే సమయంలో పార్టీ ఎప్పుడు సస్పెండ్ చేస్తుందా అని కూడా వేచి చూస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెపుతున్నాయి. తద్వారా ప్రజల నుంచి సానుభూతి మరింత పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. పార్టీ సస్పెండ్ చేసినా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే విషయంలో కూడా తొందరపడకుండా ఆచితూచి వ్యవహరించే ధోరణితో ఉన్నట్లు సమాచారం. మరో రెండేళ్లలో వచ్చే సాధారణ ఎన్నికల వరకు ఇదే టెంపో కొనసాగించే ఆలోచన ఉన్నట్లు సమాచారం. నిన్నటి సహచరులు.. నేటి శత్రువులు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ తరువాత టీఆర్ఎస్ అంటే గుర్తుకొచ్చే పేరు ఈటల రాజేందర్. ఉద్యమ కాలం నుంచే కాకుండా.. ప్రభుత్వంలోనూ కీలక మంత్రిత్వ శాఖల్లో కొనసాగారు. పార్టీలోనూ ప్రధాన నాయకుడిగా ఉన్నారు. ఇతర మంత్రులు, నాయకులు కూడా అదే స్థాయిలో ఈటలకు గౌరవం ఇచ్చేవారు. ఇప్పుడు భూకబ్జాల ఎపిసోడ్ తెరపైకి వచ్చి ఆయన పదవికి గండం రావడంతో నిన్నటి వరకు సహచరులుగా ఉన్నవారంతా శత్రువులయ్యారు. కేసీఆర్‌పై ఈటల స్వరం పెంచడంతో ఉమ్మడి జిల్లాలో సహచర మంత్రులుగా ఉన్న కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ హైదరాబాద్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈటలపై విరుచుకుపడ్డారు. గంగుల కమలాకర్ మరో అడుగు ముందుకేసి ‘బీసీగా చెప్పుకునే దొర.. మేకవన్నె పులి’ అంటూ విమర్శలు గుప్పించారు. హుజూరాబాద్‌పైనే ఇక దృష్టి పెడతామని, నియోజకవర్గంలో పర్యటిస్తామని చెప్పుకొచ్చారు. తాజాగా ఉమ్మడి జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతారావు హుజూరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ ఈటలపై ఫైర్ అయ్యారు. సొంతపార్టీ వారినే ఇబ్బందులకు గురిచేశారని, ఉప ఎన్నికల్లో తానే హుజూరాబాద్ నుంచి పోటీ చేస్తానని చెప్పుకొచ్చారు. టీఆర్ఎస్ నేతల దాడి రోజురోజుకూ పెరుగుతుందని తెలుసు కాబట్టే.. ఈటల కూడా సంయమనంతో వ్యవహరిస్తూ అడుగులు వేస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. చదవండి: అసైన్డ్ భూమిని ఆక్రమించడం తప్పు కాదా..? రెండోసారి పవర్.. ఈటలపై నజర్! -
ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో సిద్ధూ !
సాక్షి బెంగళూరు: ఇటీవలే సీఎల్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య త్వరలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కాంగ్రెస్ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుండె వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధరామయ్య.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఆస్పత్రిలో తనను కలిసేందుకు వచ్చిన నేతలంతా సీఎల్పీ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సిద్ధరామయ్య తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. -
పార్టీ మారడం కరెక్ట్ కాదని నాకు తెలుసు
-
ఎమ్మెల్యే పదవికి రాజీనామాపై 15న నిర్ణయం
శ్రీకాళహస్తి: మంత్రివర్గం నుంచి తొలగించడంపై అసంతృప్తిగా ఉన్న మాజీమంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి ... ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంపై ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. తనను కేబినెట్ నుంచి తొలగించడం చాలా బాధగా ఉందని, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అంశంపై ఈ నెల 15న తుది నిర్ణయం తీసుకుంటానన్నారు. కార్యకర్తల అభిప్రాయం ప్రకారం నడుచుకుంటానని ఆయన తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్న విషయం వాస్తవమేనని, అయితే ఈ కారణంతో మంత్రివర్గం నుంచి తొలగించడం సరికాదన్నారు. ఈ చర్యకు బాధపడే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలతో చర్చించి తదుపరి నిర్ణయాన్ని మీడియకు తెలియచేస్తానని బొజ్జల తెలిపారు.