గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.
కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి రాయ్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక, కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్ ఎంఎన్ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.
అయితే, కృష్ణ కుమారి రాయ్ రాజీనామాపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్‌కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు.
Sikkim Chief Minister Prem Singh Tamang’s wife Krishna Kumari Rai resigns as MLA,a day after taking oath. pic.twitter.com/asimdk98Uh
— KGFChandra (@FieldsKolar) June 13, 2024
Comments
Please login to add a commentAdd a comment