Prem Singh Tamang
-
ఎమ్మెల్యేగా సీఎం సతీమణి ప్రమాణం.. 24 గంటల్లోనే రాజీనామా ఎందుకంటే?
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలో రాజకీయంగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ సతీమణి కృష్ణ కుమారి రాయ్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే తన పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది.కాగా, సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా పార్టీ తరఫున నామ్చి-సింగితాంగ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన కృష్ణ కుమారి రాయ్ విజయం సాధించారు. ఈ క్రమంలో ఆమె ఎమ్మెల్యేగా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, అనూహ్యంగా ఆమె మరుసటి రోజే(గురువారం) ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఇక, కృష్ణ కుమారి రాజీనామాను సిక్కిం స్పీకర్ ఎంఎన్ షేర్పా ఆమోదించినట్టు అసెంబ్లీ కార్యదర్శి లలిత్ కుమార్ గురుంగ్ తెలిపారు.అయితే, కృష్ణ కుమారి రాయ్ రాజీనామాపై సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘నా జీవిత భాగస్వామి ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పించింది. ఎస్కేఎం పార్టీ పార్లమెంటరీ కమిటీ అభ్యర్థన మేరకు ఆమె ఎన్నికల్లో పోటీ చేసింది. సభ్యుల ఏకగ్రీవ నిర్ణయంతో ఆమె తన పదవి నుంచి వైదొలగినట్లు రాష్ట్ర ప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఆమె మాకు ఇచ్చిన మద్దతుకు హృదయపూర్వక కృతజ్ఞతలు’ అంటూ కామెంట్స్ చేశారు. Sikkim Chief Minister Prem Singh Tamang’s wife Krishna Kumari Rai resigns as MLA,a day after taking oath. pic.twitter.com/asimdk98Uh— KGFChandra (@FieldsKolar) June 13, 2024 -
Sikkim: ఎస్కేఎం శాసనసభాపక్ష నేతగా తమాంగ్
గ్యాంగ్‌టక్: సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్కేఎం) శాసనసభా పక్ష నేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ అసెంబ్లీలోని 32 సీట్లకు గాను 31 సీట్లను కైవసం చేసుకోవడం తెల్సిందే. ఆదివారం రాత్రి సీఎం తమాంగ్ అధికార నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్కేఎం సెక్రటరీ జనరల్ అరుణ్ ఉప్రెటి శాసనసభా పక్ష నేతగా తమాంగ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సోనమ్ లామా బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి తమాంగ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. -
సిక్కింలో ఎస్కేఎం
గాంగ్టక్: సిక్కిం శాసనసభ ఎన్నికల్లో సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) సంచలన విజయం నమోదు చేసింది. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో 32 స్థానాలకు గాను ఏకంగా 31 తన ఖాతాలో వేసుకుంది. వరుసగా రెండోసారి అధికారం దక్కించుకుంది. ఎస్కేఎం అధినేత, ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఈ ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగి రెండింటా విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో 17 సీట్లు గెలుచుకున్న ఎస్కేఎం ఈసారి క్లీన్‌స్వీప్ చేయడం విశేషం. పోలైన మొత్తం ఓట్లలో 58.28 శాతం సాధించింది! 2019 దాకా 25 ఏళ్ల పాటు అప్రతిహతంగా రాష్ట్రాన్ని పాలించిన విపక్ష సిక్కిం డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎస్డీఎఫ్) ఒకే ఒక్క స్థానానికి పరిమితమైంది. ఎస్డీఎఫ్ అధ్యక్షుడు, మాజీ సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ అనూహ్య ఓటమి చవిచూశారు. బీజేపీ, కాంగ్రెస్ అయితే ఖాతాయే తెరవలేదు! 31 సీట్లలో పోటీ చేసిన బీజేపీకి కేవలం 5.18 శాతం ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కైతే 0.32 శాతం ఓట్లే వచ్చాయి. భారత ఫుట్‌బాల్ జట్టు మాజీ కెపె్టన్, ఎస్డీఎఫ్ ఉపాధ్యక్షుడు బైచుంగ్ భూటియా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే దిల్లీరామ్ థాపా కూడా ఓటమి చవిచూశారు. నామ్చీ జిల్లా బర్ఫుంగ్ నుంచి పోటీ చేసిన భూటియా ఎస్కేఎం అభ్యర్థి డోర్జీ భూటియా చేతిలో ఓటమి చవిచూశారు. డోర్జీకి 8,358 ఓట్లు, భూటియాకు 4,012 ఓట్లు లభించాయి. అసెంబ్లీ ఎన్నికల ముందే భూటియా ఎస్డీఎఫ్లో చేరారు.మోదీ అభినందనలు ఎస్‌కేఎంకు, సీఎం తమాంగ్కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. రాష్ట్రాభివృద్ధి కోసం కలిసి పని చేస్తామన్నారు. బీజేపీకి ఓటేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ‘ఎక్స్’లో పోస్టు చేశారు. ప్రధానికి తమాంగ్ కృతజ్ఞతలు తెలిపారు.టీచర్ నుంచి సీఎం దాకా తమాంగ్ ఆసక్తికర ప్రస్థానం ప్రేమ్‌సింగ్ తమాంగ్. సిక్కింలో ఎస్కేఎం క్లీన్‌స్వీప్ వెనుక ఉన్న శక్తి. 56 ఏళ్ల తమాంగ్ వ్యక్తిగత చరిష్మాతోపాటు పరిపాలనాదక్షుడిగా ఆయనకున్న పేరు, అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలు ఈ ఘన విజయానికి కారణమయ్యాయి. తమాంగ్ 1968 ఫిబ్రవరి 5న జన్మించారు. తల్లిదండ్రులు కాలూసింగ్ తమాంగ్, ధన్మాయ తమాంగ్. పశి్చమబెంగాల్‌లోని డార్జీలింగ్లో కాలేజీ విద్య పూర్తిచేశారు. 1990లో ప్రభుత్వ ఉపాధ్యయుడిగా ఉద్యోగంలో చేరారు. మూడేళ్ల తర్వాత రాజీనామా చేసి ఎస్డీఎఫ్లో చేరారు. 15 ఏళ్లపాటు మంత్రిగా చేశారు. 2009లో నాటి సీఎం పవన్ కుమార్ చామ్లింగ్‌తో విభేదించి ఎస్డీఎఫ్ నుంచి బయటకొచ్చారు. 2013లో ఎస్కేఎం ఏర్పాటు చేశారు. 2014 ఎన్నికల్లో పార్టీ 10 సీట్లు సాధించింది. అవినీతికి కేసుల్లో అరెస్టయిన తమాంగ్ ఏడాదిపాటు జైల్లో ఉండి 2017లో బయటికొచ్చారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో 17 సీట్లు గెలిచి రెండేళ్లకే సీఎం అయ్యారు. అనంతరం పార్టీని మరింత పటిష్టపరిచారు. -
సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా ఘన విజయం
గ్యాంగ్‌టక్: సిక్కింలో అధికార సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) ఘన విజయం సాధించింది. ఇటిప్పటి వరకు విడుదలైన ఎన్నికల ఫలితాల్లో ఎస్కేఎం 29 స్థానాల్లో గెలిచింది. మరో 2 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. మేజిక్ ఫిగర్ 17 స్థానాలు.విపక్ష సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీకి కేవలం ఒకే స్థానంలో గెలిచి.. ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండు పార్టీలు మొత్తం 32 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాయి. ఇక బీజేపీ అక్కడ 31 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. కొన్ని పార్టీలతో పొత్తులో భాగంగా కాంగ్రెస్ 12 స్థానాల్లో పోటీ చేసింది. ఆ పార్టీ ఖాతా తెరవలేదు. -
రెండు స్థానాల్లో పోటీ చేయనున్న సిక్కిం సీఎం
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) పార్టీ.. రాష్ట్రంలో వున్న మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ 'ఇంద్ర హంగ్ సుబ్బా' పేరును ప్రకటించింది. అయితే సిక్కిం ముఖ్యమంత్రి 'ప్రేమ్ సింగ్ తమాంగ్' (Prem Singh Tamang) రాబోయే ఎన్నికలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు. ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య 'కృష్ణ కుమారి రాయ్' నామ్చి-సింఘితాంగ్ స్థానంలో ప్రతిపక్ష SDF అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్‌తో పోటీపడనుంది. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్ పోటీ చేయనున్నారు. దీనిపైన SKM పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ స్పీకర్ అరుణ్ కుమార్ ఉప్రేటి (Arun Upreti) గ్యాంగ్‌టక్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. -
సిక్కింలో భారీ ప్రాణనష్టం.. డ్యామ్ నిర్మాణంపై సీఎం సంచలన కామెంట్స్
గ్యాంగ్‌టక్: ఈశాన్య రాష్ట్రం సిక్కింలో సంభవించిన ఆకస్మిక వరదల్లో మృతుల సంఖ్య 40కి చేరుకోగా.. వారిలో 22 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. అదేవిధంగా, 22 మంది ఆర్మీ అధికారులు సహా గల్లంతైన వారి సంఖ్య 98కు పెరిగింది. ఈ నేపథ్యంలో వరదలపై సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నాసి రకం నిర్మాణం కారణంగా సిక్కింలోని చుంగుతాంగ్ డ్యామ్ కొట్టుకుపోయిందన్నారు. కాగా, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్యామ్ నిర్మాణం సరైన పద్ధతిలో జరగలేదు. ఫలితంగా ఇది కొట్టుకుపోయింది. రాష్ట్రం ఉత్తరభాగంతో మిగిలిన ప్రాంతాలకు సంబంధాలు తెగిపోయాయి. క్లౌడ్ బర్ట్సింగ్ కారణంగా భారీ వర్షాల నేపథ్యంలో డ్యామ్ పూర్తిగా దెబ్బతిన్నట్టు తెలిపారు. 1200 మెగావాట్ల జలవిద్యుత్ ప్రాజెక్ట్ కూడా వరదల కారణంగా కొట్టుకుపోయినట్టు స్పష్టం చేశారు. ఇది సిక్కిం రాష్ట్రానికి భారీ నష్టాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. రోడ్లు కొట్టుకుపోయాయి, వంతెనలు ధ్వంసమయ్యాయి. తీస్తాపై 13 వంతెనలు కొట్టుకుపోయాయని తమాంగ్ వివరించారు. #SikkimFlashFloods | Sikkim CM #PremSinghTamang said that the previous Sikkim Democratic Front government should be blamed for the tragedy of their sub-standard workhttps://t.co/bhUCNypX0B — Mint (@livemint) October 6, 2023 ఇదిలా ఉండగా.. ఉత్తర సిక్కింలోని లోనాక్ సరస్సు సైజు గత 30 ఏళ్లలో మూడు రెట్లు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి. తాజాగా చుంగుతాంగ్ డ్యామ్‌కు గండి పడిన సమయంలో లోనాక్ సరస్సు నుంచి పూర్తి నీరు డ్యామ్‌లోకి చేరలేదు. ఈ సరస్సులో ఇంకా నీరు ఉన్నట్లు శాటిలైట్ ఫొటోలు వివరిస్తున్నారు. ఈ నీరు కూడా డ్యామ్‌లోకి చేరితే పెనువిపత్తు చోటు చేసుకునేదని నిపుణులు చెబుతున్నారు. సిక్కింలో ఇలాంటి సరస్సులు మొత్తం 14 వరకు ఉన్నాయి. వీటిల్లో కుంభవృష్టిలు, భారీ మంచు పెళ్లలు విరిగిపడినా.. ఇవి గట్లు తెంచుకొని ఊళ్లపై పడతాయి. లోనాక్ సరస్సు ప్రదేశం సెస్మిక్ జోన్లో ఉండటంతో భూకంపాల కారణంగా ఇది లీకయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. VIDEO | "There have been damages worth Rs 1,000 crore. We cannot give exact details about damages, it will be revealed once a committee is formed and it completes its analysis. Our first priority is to save those who are stranded and provide them immediate relief," Sikkim CM… pic.twitter.com/cUcgjHdChO — Press Trust of India (@PTI_News) October 6, 2023 మరోవైపు.. ఆకస్మిక వరదలతో చుంగ్థంగ్ డ్యామ్ ధ్వంసం కావడం.. విద్యుత్ మౌలిక వ్యవస్థలు దారుణంగా దెబ్బతినడంతోపాటు నాలుగు జిల్లాల్లోని పలు గ్రామాలు, పట్టణాలు జల దిగ్బంధంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. మంగన్ జిల్లాలోని 8 వంతెనలు సహా మొత్తం 11 బ్రిడ్జీలు వరదల్లో కొట్టుకుపోయాయి. రాష్ట్రానికి గుండెకాయ వంటి పదో నంబర్ రహదారి పలుచోట్ల ధ్వంసమైంది. చుంగ్థంగ్ పట్టణం తీవ్రంగా దెబ్బతింది. తీస్తా నదికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నందున, పరీవాహక ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రదేశాలకు చేరుకోవాలని ఎస్‌ఎస్‌డీఎంఏ కోరింది. సిక్కింలోని వేర్వేరు ప్రాంతాల్లో వరదల్లో చిక్కుకుపోయిన వేల మంది పర్యాటకుల్లో విదేశీయులూ ఉన్నారు. Tista Dam near Chungthang , North sikkim. Dam at loc was swept away, which cauSes 50 feet hike in tista river. Massive water force has swept away everything in his route. Massive destruction in area reported. Urgent help needed #sikkimfloods #ANI #Aajtak #Ndtv #PMO pic.twitter.com/R2PkruFf9p — Anand Mishra (@Anand55587175) October 6, 2023 -
మహిళా అధికారులకు 12 నెలలు ప్రసూతి సెలవులు
గాంగ్టక్: సిక్కిం రాష్ట్ర సివిల్ సర్వీస్ ఆఫీసర్ల అసోషియేషన్ సమావేశంలో ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ కీలక ప్రకటన చేశారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అధికారులైన మహిళలకు ఏడాది పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులపాటు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. సిక్కిం స్టేట్ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ అసోసియేషన్(SSCSOA) సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ ఉద్యోగులకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చే విధంగా సర్వీసు రూల్స్ లో కొన్ని కీలక మార్పులు చేస్తున్నట్లు ప్రకటించారు. సీఎం తమాంగ్ మాట్లాడుతూ.. రాష్ట్ర పరిపాలనలో అధికార యంత్రాంగం పాత్ర చాలా ముఖ్యమైనదని, రాష్ట్ర ఎదుగుదలకు, అభివృద్ధికి వారు వెన్నుముకగా నిలిచారని అన్నారు. ఇకపై మహిళా అధికారులకు 12 నెలల పాటు మాతృత్వ సెలవులు, పురుషులకు నెల రోజులు పితృత్వ సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. దీని వలన విధినిర్వహణలో భాగంగా ఎప్పుడూ కుటుంబానికి దూరంగా ఉండే అధికారులకు కుటుంబంతోనూ పిల్లలతోనూ కొంత సమయం గడిపే అవకాశముంటుందని అన్నారు. అతి త్వరలోనే సర్వీస్ రూల్స్ లో ఈ సవరణలు చేస్తామని చెబుతూ, కొత్తగా ఎంపికైన ఐఏఎస్, సిక్కిం సివిల్ సర్వీసెస్ అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 ప్రకారం ప్రస్తుతం 6 నెలలు లేదా 28 వారాల పాటు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే మహిళలకు ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడది సంవత్సరం పాటు పెంచడంతో మహిళా అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇది కూడా చదవండి: జనం మీకు ఎర్ర జెండా ఊపడం ఖాయం..ప్రధానికి రాజస్థాన్ సీఎం కౌంటర్ -
జనాభాను పెంచేందుకు సిక్కింలో ప్రభుత్వోద్యోగినులకు వరాలు
గాంగ్టాక్: సిక్కిం రాష్ట్ర ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు సీఎం ప్రేమ్ సింగ్ తమంగ్ పలు ప్రోత్సాహకాలను ప్రకటించారు. వారి చిన్నారులకు ఇంటి వద్దే సహాయకులను ఉచితంగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నారుల బాధ్యత తీసుకునే ఆయాలకు నెలకు రూ.10 వేలను ప్రభుత్వమే ఇస్తుందన్నారు. 40 ఏళ్లు, ఆపైన వయస్సుండే మహిళలకు చిన్నారులను ఏడాది వరకు చూసుకునే బాధ్యతలను అప్పగిస్తామన్నారు. మహిళా ఉద్యోగుల ప్రసూతి సెలవులను 365 రోజులకు, తండ్రులకైతే నెల రోజులు సెలవులు ఇస్తామని చెప్పారు. రెండో బిడ్డను పోషించేందుకు ఒక ఇంక్రిమెంట్, మూడో బిడ్డకైతే రెండు ఇంక్రిమెంట్లు ఇస్తామన్నారు. తరిగిపోతున్న జననాల రేటు చాలా ఆందోళన కలిగించే అంశమన్నారు. క్షీణిస్తున్న స్థానిక జాతుల జనాభాను పెంచేందుకు ప్రభుత్వం సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. తల్లులవ్వాలనుకునే ఉద్యోగినులు పుట్టబోయే తమ సంతానం బాగోగుల గురించి ఆందోళన చెందరాదనే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు. జననాల రేటు పెంచేందుకు సాధారణ ప్రజానీకానికి కూడా ప్రోత్సహకాలు ప్రకటించనున్నట్లు ఆయన వెల్లడించారు. సంతానం కలగడంలో ఇబ్బందులు ఎదురయ్యే వారి కోసం ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రాల్లో చికిత్స తీసుకునే వారికి రూ. 3 లక్షలు గ్రాంటుగా అందజేస్తామన్నారు. సిక్కింలోని 7 లక్షల లోపు జనాభాలో 80 శాతం మంది స్థానిక తెగల ప్రజలే. సంతానోత్పత్తి రేటు 1.1%గా ఉంది. -
పిల్లల్ని కనండి ఇంక్రిమెంట్ పొందండి.. ఉద్యోగులకు సిక్కిం సీఎం వరాలు!
భారత దేశ జనభా ఇప్పటికే దాదాపు 140 కోట్లు క్రాస్ చేసింది. జనాభా నియంత్రణ విషయంలో పలు ప్రభుత్వాలు ఇప్పటికే ఒక్కరు ముద్దు.. ఇద్దరు వద్దు అంటూ ప్రకటనలు చేశాయి. కానీ, ఇందుకు భిన్నంగా ఈశాన్య రాష్ట్రం సిక్కిం సీఎం మాత్రం కొత్త పాలసీకి తెరలేపారు. జనాభాను పెంచాలన్నారు. పిల్లల్ని కంటే ఇంక్రిమెంట్ ఉంటుందని భరోసా ఇచ్చారు. వివరాల ప్రకారం.. సిక్కింలో మాఘే సంక్రాంతి సందర్బంగా సీఎం ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమాంగ్ మాట్లాడుతూ సిక్కింలో తమ జాతి జనాభాను పెంచాలన్నారు. మూడో పిల్లాడ్ని కంటే డబుల్ ఇంక్రిమెంట్ ఇవ్వడానికి ప్రతిపాదనలు సిద్ధంగా చేస్తున్నట్టు తెలిపారు. ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగినులు ఎక్కువ మంది పిల్లల్ని కంటారో వారికి ఎక్కువ ప్రోత్సాహకాలు అందుతాయని ఆఫర్ ఇచ్చారు. అలాగే.. ఇద్దరు పిల్లల్ని కంటే ఒక ఇన్సెంటీవ్, ముగ్గురు పిల్లల్ని కన్నవారికి డబుల్ ఇక్రిమెంట్‌తో పాటు ఎక్కువ సెలవులు తీసుకునేందుకు కూడా అనుమతి ఉంటుందని భరోసా ఇచ్చారు. అయితే, సిక్కింలో ఇటీవలి కాలంలో సంతనోత్పత్తి రేటు చాలా తగ్గిపోయిందన్నారు. అందుకే తమ జాతి జనాభాను పెంచాలని సూచించారు ఇదే క్రమంలో ఐవీఎఫ్ ద్వారా తల్లి అయ్యేందుకు అవసరమైన డబ్బును కూడా ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఐవీఎఫ్ ద్వారా పిల్లల్ని కనే ఉద్యోగినులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని సీఎం తమాంగ్ వెల్లడించారు. ఐవీఎఫ్ సౌకర్యం ద్వారా ఇప్పటివరకు 38 మంది మహిళలు గర్భం దాల్చారని, కొందరు తల్లులు కూడా అయ్యారని తెలిపారు. కాగా, సర్వీసులో ఉన్న మహిళలకు 365 రోజుల ప్రసూతీ సెలవులు ఇస్తున్నారు. మగ ఉద్యోగులకు 30 రోజుల పితృత్వ సెలవులు కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాగా, సీఎం హామీలపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నట్టు తెలిపారు. -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్‌సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
సిక్కిం మరో దేశంగా ప్రభుత్వ ప్రకటన!
న్యూ ఢిల్లీ: ఢిల్లీ ప్రభుత్వం తప్పులో కాలేస్తూ జారీ చేసిన ఓ పత్రికా ప్రకటన తీవ్ర దుమారం రేపింది. ఇందులో సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంతో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి తీవ్ర అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఢిల్లీ ప్రభుత్వం హుటాహుటిన తప్పును సరిదిద్దుకుంది. వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సివిల్ డిఫెన్స్ కార్పొరేషన్లో వాలంటీర్లుగా చేరాలనుకునేవారి కోసం ప్రకటన విడుదల చేసింది. పలు పత్రికల్లోనూ ఈ యాడ్ అచ్చయింది. అందులో భూటాన్, నేపాల్ దేశాల సరసన సిక్కింను కూడా చేర్చింది. దేశంలో అంతర్భాగమైన సిక్కింను ప్రత్యేక దేశంగా పరిగణించడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తాయి. (ఈ రోడ్డు చాలా ‘హైట్’ గురూ...) కేజ్రీవాల్ క్షమాపణలు చెప్పాలి ఇదే అదనుగా భావించిన బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)పై తీవ్రంగా మండిపడింది. ఈశాన్య ప్రాంతాల మనోభావాలను దెబ్బతీసిన అర్వింద్ కేజ్రీవాల్ వెంటనే క్షమాపణలు చెప్పాలని పట్టుబట్టింది. దీనిపై స్పందించిన ఆప్.. హోం మంత్రిత్వశాఖ మార్గదర్శకాలకు అనుగుణంగానే ఈ ప్రకటన జారీ చేశామని వివరణ ఇచ్చింది. మరోవైపు ఈ ప్రకటన సిక్కిం ప్రజల మనోభావాలను దెబ్బ తీస్తున్నాయని, వెంటనే దాన్ని ఉపసంహరించుకోవాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఢిల్లీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ సదరు ప్రకటనను ఉపసంహరించుకున్నట్లు తెలిపారు. ఈ దారుణ తప్పుకు కారణమైన సంబంధిత అధికారిని విధుల నుంచి తొలగించినట్లు వెల్లడించారు. కాగా సిక్కిం ప్రత్యేక రాష్ట్రంగా 1975 మే 16న అవతరించింది. వారం రోజుల కిందటే రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంది. (క్రమశిక్షణతో కొమ్ములు వంచారు) -
‘తమాంగ్’పై లెక్కలు తప్పిన ‘ఈసీ’
సాక్షి, న్యూఢిల్లీ: భారత ఎన్నికల కమిషన్ ఆదివారం నాడు ఓ అసాధారణ నిర్ణయం తీసుకుంది. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్ ఎన్నికల్లో ఆరేళ్లపాటు పోటీ చేయకూడదనే ఆంక్షలను ఏడాది ఒక నెలకు (13 నెలలకు) కుదించింది. ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని 11వ సెక్షన్ కింద తమకున్న అధికారాలను ఉపయోగించుకొని ఈ అసాధారణ నిర్ణయం తీసుకున్నట్లు గొప్పగా సమర్థించుకుంది. ఇక్కడే దాని లెక్కలు పూర్తిగా తప్పాయి. అన్ని విషయాలను అవగాహన లోకి తీసుకొని ఆలోచిస్తే గుడ్లు తేలేసే పరిస్థితి దానికి తప్పదు. ఓ అవినీతి కేసులో దోషిగా తేలిన ప్రేమ్‌సింగ్ తమాంగ్ 2018, ఆగస్టు నెలలో జైలు నుంచి విడుదలయ్యారు. ప్రజా ప్రాతినిధ్యం చట్టం నిబంధనల ప్రకారం దోషిగా నిర్ధారితుడైన వ్యక్తి జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ఆరేళ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయడానికి వీల్లేదు. అయితే 2019, మే నెలలో సిక్కిం అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మిత్రపక్షంగా ప్రేమ్‌సింగ్ తమాంగ్ నాయకత్వంలోని ’సిక్కిం క్రాంతికారి మోర్చా’ పోటీ చేసింది. అసెంబ్లీలోని 32 సీట్లకుగాను 17 సీట్లను గెలుచుకుంది. మిత్రపక్షమైన బీజేపీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధిక సీట్లను గెలుచుకున్న ‘సిక్కిం క్రాంతికారి మోర్చా’ తమ శాసన సభాపక్ష నేతగా ప్రేమ్‌సింగ్ తమాంగ్‌ను ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో తమాంగ్‌పై ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయరాదనే అనర్హత వేటు ఉన్నప్పటికీ ఆయన్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా సిక్కిం గవర్నర్ ఆహ్వానించారు. ఆ మేరకు 2019, మే 27వ తేదీగా సిక్కిం ముఖ్యమంత్రిగా తమాంగ్ ప్రమాణ స్వీకరాం చేశారు. ఆయన గత నాలుగు నెలలుగా సీంగా పదవిలో కొనసాగుతున్నారు. శాసన సభ్యత్వం లేకుండా సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వ్యక్తి చట్ట ప్రకారం ఆరు నెలల్లో శాసస సభకు ఎన్నిక కావాల్సి ఉంది. అంటే ఆయన ఎన్నిక కావడానికి మరో రెండు నెలల వ్యవధి ఉంది. ఈ లోగా ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హత లేని వ్యక్తిని ఎలా సీఎం చేస్తారంటూ ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ ఓ రిట్ పిటిషన్ దాఖలైంది. అది ప్రస్తుతం సుప్రీం కోర్టు విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో అదివారం నాడు కేంద్ర ఎన్నికల కమిషన్ తమాంగ్‌పై ఆరేళ్లపాటున్న అనర్హత ఆంక్షలను 13 నెలలకు కుదిస్తూ అసాధారణ నిర్ణయం తీసుకుంది. తమాంగ్ 2018, ఆగస్టు నెలలో విడుదలయ్యారు గనుక ఆయనపై ఆంక్షలు 2019, సెప్టెంబర్ నెల వరకు వర్తిస్తాయి. అక్టోబర్ నుంచి వర్తించవు. ఆయన నాలుగు నెలల క్రితమే సీఎం బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో ఆయన అసెంబ్లీకి పోటీ చేయవచ్చన్నది ఎన్నికల కమిషన్ అంచనా లేదా వ్యూహం అని చెప్పవచ్చు. ఇక్కడే ఎన్నికల కమిషన్ అడుసులో కాలేసింది. అనర్హత వేటును ఎదుర్కొంటున్న వ్యక్తి సీఎంగా బాధ్యతలు స్వీకరించడానికే అనర్హుడు. ఈ విషయం ఎన్నికల కమిషన్ దృష్టిలో లేనట్లుంది. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత విషయంలో 2001లో సుప్రీం కోర్టు ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2000, ఏప్రిల్ నెలలో ఓ ప్రభుత్వ భూమి అమ్మకంలో జయలలిత అవినీతికి పాల్పడినట్లు 2001లో తేలింది. దాంతో ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమె ఆరేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా పోయింది. 2001లో తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో జయలలితకు చెందిన ఏఐఏడిఎంకే పార్టీ విజయం సాధించింది. ఆ నేపథ్యంలో 2001, జూన్ నెలలో ఆమెతో సీఎంగా ఆ రాష్ట్ర గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కేసులో జయలలిత నియామం చెల్లదంటూ సుప్రీం కోర్టు తీర్పు చెప్పింది. ‘అనర్హత ఆంక్షలు ఎదుర్కొంటున్న వ్యక్తిని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఏ కారణంతోని నియమించినా ఆ నియామకం చెల్లదు. ఆ నియామకం భారత రాజ్యాంగంలోని 164వ అధికరణకు విరుద్ధం. గవర్నర్ నియమించారన్న కారణంగా సీఎం నియామకం చెల్లుబాటు కాదు. రాజ్యాంగ నిబంధనలకు ఏమాత్రం విరుద్ధంగా ఉన్నా ఆ నియామకాన్ని రద్దు చేయాల్సిందే. ఆ తదుపరి న్యాయ ప్రక్రియ ద్వారాగానీ, నోటిఫికేషన్ ద్వారాగానీ నియామకాన్ని రద్దు చేయవచ్చు’ అంటూ సుప్రీం కోర్టు స్పష్టమైన తీర్పు చెప్పింది. తమాంగ్‌పై అనర్హత ఆంక్షలను ఎన్నికల కమిషన్ 13 నెలలకు కుదించడం వల్ల ఆ ఆంక్షలు ఈ సెప్టెంబర్ నెల వరకు వర్తిస్తాయి. తమాంగ్ నియామకం నాలుగు నెలల క్రితమే జరిగినందున సుప్రీం కోర్టు ఉత్తర్వులు చెల్లవు. తమాంగ్ తనపై ఆంక్షలను రద్దు చేయాల్సిందిగా గానీ లేదా కుదించాల్సిందిగా గానీ ఎన్నికల కమిషన్‌ను ఆశ్రయించారా? అంటూ ఎన్నికల కమిషన్ వర్గాలను మీడియా ప్రశ్నించగా, లేదని సమాధానం వచ్చింది. అలాంటప్పుడు ఆయనపై ఎన్నికల కమిషన్‌కు ఈ అసాధారణ ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తీవ్ర ఒత్తిళ్లను ఎదుర్కొంటున్న ఎన్నికల కమిషన్ ఈసారి కూడా ఒత్తిళ్లకు తలొగ్గే ఇలాంటి అసాధారణ నిర్ణయం తీసుకుందా ? ఏదేమైనప్పటికీ అంతిమ తీర్పు రాజ్యాంగానికి లోబడాల్సిందే కదా! -
24ఏళ్ల తరువాత మారిన సీఎం
గాంగ్టక్: సిక్కింలో 24 సంవత్సరాల తరువాత కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్కేఎం) అధ్యక్షుడు, పీఎస్ గోలె పేరుతో ప్రజలకు చిరపరిచితులైన ప్రేమ్‌సింగ్ తమాంగ్(51) సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్ మైదానంలో గోలెతో పాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. గోలె ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు.. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. అయినప్పటికీ శనివారం శాసనసభా నేతగా ఎన్నికయ్యారు. 2013లో ఎస్కేఎం పార్టీని స్థాపించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలవడం ద్వారా 24 ఏళ్ల తరువాత చామ్లింగ్ ప్రభుత్వాన్ని మార్చగలిగింది. ఎస్డీఎఫ్ 15 సీట్లు సాధించింది.