
సిక్కిం క్రాంతికారి మోర్చా (SKM) పార్టీ.. రాష్ట్రంలో వున్న మొత్తం 32 అసెంబ్లీ స్థానాలు, ఒక లోక్‌సభ స్థానానికి అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. లోక్‌సభ స్థానానికి ప్రస్తుత ఎంపీ 'ఇంద్ర హంగ్ సుబ్బా' పేరును ప్రకటించింది. అయితే సిక్కిం ముఖ్యమంత్రి 'ప్రేమ్ సింగ్ తమాంగ్' (Prem Singh Tamang) రాబోయే ఎన్నికలలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేయనున్నారు.
ప్రేమ్ సింగ్ తమాంగ్ భార్య 'కృష్ణ కుమారి రాయ్' నామ్చి-సింఘితాంగ్ స్థానంలో ప్రతిపక్ష SDF అధ్యక్షుడు పవన్ కుమార్ చామ్లింగ్‌తో పోటీపడనుంది. సోరెంగ్-చకుంగ్, రెనోక్ నియోజకవర్గాల నుంచి ప్రేమ్ సింగ్ తమంగ్ పోటీ చేయనున్నారు. దీనిపైన SKM పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుందని అసెంబ్లీ స్పీకర్ అరుణ్ కుమార్ ఉప్రేటి (Arun Upreti) గ్యాంగ్‌టక్‌లో విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.