సిక్కిం ముఖ్యమంత్రిగా పీఎస్ గోలె
గాంగ్‌టక్: సిక్కింలో 24 సంవత్సరాల తరువాత కొత్త ముఖ్యమంత్రి వచ్చారు. సిక్కిం క్రాంతికారి మోర్చా (ఎస్‌కేఎం) అధ్యక్షుడు, పీఎస్ గోలె పేరుతో ప్రజలకు చిరపరిచితులైన ప్రేమ్‌సింగ్ తమాంగ్(51) సోమవారం సిక్కిం ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. పల్జోర్ మైదానంలో గోలెతో పాటు మరో 11 మంది శాసనసభ్యులచేత కూడా గవర్నర్ గంగా ప్రసాద్ ప్రమాణం చేయించారు. గోలె ప్రస్తుత శాసనసభలో సభ్యుడు కారు.. ఈ ఎన్నికల్లో కనీసం పోటీ చేయలేదు. అయినప్పటికీ శనివారం శాసనసభా నేతగా ఎన్నికయ్యారు. 2013లో ఎస్‌కేఎం పార్టీని స్థాపించారు. 32 స్థానాలున్న సిక్కిం అసెంబ్లీలో 17 స్థానాలు గెలవడం ద్వారా 24 ఏళ్ల తరువాత చామ్లింగ్ ప్రభుత్వాన్ని మార్చగలిగింది. ఎస్‌డీఎఫ్ 15 సీట్లు సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment