
గ్యాంగ్‌టక్: సిక్కిం క్రాంతికారీ మోర్చా(ఎస్‌కేఎం) శాసనసభా పక్ష నేతగా ప్రేమ్ సింగ్ తమాంగ్ ఎన్నికయ్యారు. తాజాగా వెలువడిన ఫలితాల్లో ఆ పార్టీ అసెంబ్లీలోని 32 సీట్లకు గాను 31 సీట్లను కైవసం చేసుకోవడం తెల్సిందే.
ఆదివారం రాత్రి సీఎం తమాంగ్ అధికార నివాసంలో జరిగిన శాసనసభాపక్ష సమావేశానికి మొత్తం 31 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఎస్‌కేఎం సెక్రటరీ జనరల్ అరుణ్ ఉప్రెటి శాసనసభా పక్ష నేతగా తమాంగ్ పేరును ప్రతిపాదించగా ఎమ్మెల్యే సోనమ్ లామా బలపరిచారు. అనంతరం ఎమ్మెల్యేలతో కలిసి తమాంగ్ గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను కలిశారు. ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.