ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో సిద్ధూ ! | Resignation decision on siddaramaiah mla | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యే పదవికి రాజీనామా యోచనలో సిద్ధూ !

Published Mon, Dec 16 2019 4:30 AM | Last Updated on Mon, Dec 16 2019 4:30 AM

Resignation decision on siddaramaiah mla - Sakshi

సిద్ధరామయ్య

సాక్షి బెంగళూరు: ఇటీవలే సీఎల్పీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మాజీ సీఎం సిద్ధరామయ్య త్వరలో శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తారనే ఊహాగానాలు కాంగ్రెస్‌  వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. గుండె వ్యాధితో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సిద్ధరామయ్య.. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాలనుకుంటున్నట్లు తన సన్నిహితుల వద్ద చెప్పినట్లు సమాచారం. ఆస్పత్రిలో తనను కలిసేందుకు వచ్చిన నేతలంతా సీఎల్పీ పదవికి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అయితే, ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సిద్ధరామయ్య తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆయన ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement