
'బీజేపీ వల్లే టీడీపీకి ముస్లింలు దూరం'
ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
చిత్తూరు: ఆంధ్రప్రదేశ్ అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీ వల్లే తెలుగుదేశం పార్టీకి ముస్లింలు దూరమయ్యారని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో ఈ వ్యాఖ్యలు చేశారు. బక్రీద్ సందర్భంగా ఈద్గా మైదానంలోని ముస్లింలను మంత్రి బొజ్జల కలిశారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు.