'కేసీఆర్.. దమ్ముంటే బెజవాడలో నిరూపించు'
చిత్తూరు : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ మంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి మండిపడ్డారు. కేసీఆర్కు దమ్ము, ధైర్యం ఉంటే తెలంగాణలో విద్యుత్ సమస్యకు చంద్రబాబే కారణమని విజయవాడలో నిరూపించాలని సవాల్ విసిరారు. కుప్పం ప్రాంతంలో ఏనుగులు పంట పొలాల్లోకి రాకుండా అడవుల్లోనే ఆహారం, నీరు ఏర్పాటు చేస్తామని ఆయన సోమవారమిక్కడ తెలిపారు.
పంట నష్టపోయిన రైతులకు కొత్త రేట్లను నిర్ణయించి పరిహారం చెల్లిస్తామని బొజ్జల హామీ ఇచ్చారు. కాగా చంద్రబాబు నాయుడు మోసాలపై విజయవాడలో బహిరంగ సభ పెట్టి ఆంధ్ర రైతాంగానికి తెలియచేస్తామని కేసీఆర్ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.