కేసీఆర్ ఆరోపణలు నిజమైతే మంత్రిపదవికి గుడ్బై
తిరుపతి : కేసీఆర్పై ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ పచ్చి అబద్ధాల కోరు అని, ఆయన చేతగానితనం వల్లే తెలంగాణకు విద్యుత్ సంక్షోభం నెలకొందని ఆయన వ్యాఖ్యానించారు. దేవినేని ఉమ శనివారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ చంద్రబాబు ముందుచూపుతో విద్యుత్ను కొనుగోలు చేశారన్నారు.
ప్రకాశం బ్యారేజ్పై చంద్రబాబు నాయుడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతుల కోసం చేసిన మహాధర్నాను కేసీఆర్ వక్రీకరించారన్నారు. అది వాస్తవం అని నిరూపించడానికి తాను సిద్ధంగా ఉన్నానని దేవినేని సవాల్ విసిరారు. కేసీఆర్ ఆరోపణలు నిజమైతే మంత్రి పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమన్నారు. శ్రీశైలం ప్రాజెక్ట్లో నీటిమట్టం తగ్గితే రాయలసీమ వాసులకు తాగునీటి కష్టాలు తప్పవని దేవినేని ఉమ అన్నారు. పై రాష్ట్రాల నుంచి ఒక్క టీఎంసీ నీటిని కూడా తెచ్చుకునే పరిస్థితి లేదన్నారు.