విభజన చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారు: కేసీఆర్
విభజన చట్టాన్ని చంద్రబాబు ఉల్లంఘిస్తున్నారు: కేసీఆర్
Published Sat, Oct 25 2014 9:45 AM | Last Updated on Tue, Sep 18 2018 8:28 PM
హైదరాబాద్: విభజన చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ చంద్రబాబునాయుడ ఉల్లంఘిస్తున్నారని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ అన్నారు. విద్యుత్ అంశంపై అసత్య ప్రచారం చేస్తున్నారని కేసీఆర్ విమర్శించారు.
తెలంగాణ ప్రభుత్వానికి విద్యుత్ అంశంప ముందు చూపు లేదని చంద్రబాబు చేసిన విమర్శలను కేసీఆర్ తిప్పికొట్టారు. మాకు ముందు చూపు లేకపోయినా చంద్రబాబులా దొంగ చూపులేదని కేసీఆర్ ఎద్దేవా చేశారు. శ్రీశైలం విద్యుత్ పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్టు కేసీఆర్ తెలిపారు.
కృష్ణపట్నం విద్యుత్ కేంద్రం జాయింట్ వెంచర్.. అదేమన్నా నీ అయ్యాజాగీరా? అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు. విభజన చట్టం ప్రకారం అన్ని ప్రాజెక్టుల్లో తెలంగాణకు 54 శాతం వాటా ఇవ్వాల్సిందేనని కేసీఆర్ అన్నారు. సీలేరులో మీకు రావాల్సిన వాటా కంటే ఎక్కువగానే వాడుకున్నారన్నారు.
తెలంగాణకు విద్యుత్ ఇవ్వవద్దని హిందూజాలను చంద్రబాబు బెదిరించారని.. ఆవిషయాన్ని స్వయంగా హిందూజా ప్రతినిధులు తెలిపిన విషయాన్ని కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. తెలంగాణకు రావాల్సిన విద్యుత్ లో భారీగా కోత విధించారని, సీలేరు విద్యుత్ కేటాయింపులో చంద్రబాబు మోసానికి పాల్పడ్డారని కేసీఆర్ ఆరోపించారు. చంద్రబాబూ నీ మోసాలకు అంతు ఉండదా అంటూ కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ రైతులంటే ఇంత కక్ష్య ఎందుకు అంటూ కేసీఆర్ నిప్పులు చెరిగారు.
Advertisement