హరితాంధ్రప్రదేశ్ సాధన దిశగా డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో 15 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు రాష్ట్ర
15 కోట్ల మొక్కలు పెంపకం
Nov 23 2016 3:09 AM | Updated on Apr 3 2019 5:55 PM
రేణిగుంట: హరితాంధ్రప్రదేశ్ సాధన దిశగా డిసెంబర్ నెలాఖరుకు రాష్ట్రంలో 15 కోట్ల మొక్కలను నాటే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు రాష్ట్ర అటవీశాఖ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని మామండూరు అటవీప్రాంతంలో మంగళవారం సామాజిక వనవిభాగం నిర్వహించిన కార్తీక వనమహోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నీరు-చెట్టు కార్యక్రమంలో భాగంగా అటవీశాఖ పచ్చదనాన్ని పెంపొందించే లక్ష్యంతో 98,350 ఎకరాల్లో మొక్కలు నాటే కార్యక్రమం జరుగుతోందన్నారు.
అడవుల విస్తీర్ణం 23 శాతం నుంచి 33శాతానికి పెంచడమే లక్ష్యంగా తాము పనిచేస్తున్నామని పేర్కొన్నారు. విలువైన సంపద ఎరచ్రందనాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచంలో ఎక్కడా లభించని ఈ ఎరచ్రందనం చిత్తూరు, కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లోని శేషాచలం అడవుల్లో లభిస్తుందని, విలువైన సంపద కొందరి అక్రమాల వలన అంతరించిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్తీక వనభోజన కార్యక్రమం అందరినీ ఒక్కటిగా చేస్తుందని, ఇలాంటి సాంప్రదాయం భావితరాలకు దిక్సూచిగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమాన్ని మరో 10 రోజుల్లో జిల్లా అంతటా నిర్వహించేందుకు అధికారులకు ఆదేశాలిచ్చామన్నారు. అనంతరం వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు వనాల ఆవశ్యకతపై నిర్వహించిన వ్యాసరచన, డ్రారుుంగ్, క్విజ్ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం-మనం, ప్రకృతి పిలుస్తోంది వంటి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ స్టాల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి, చిత్తూరు ఎంపీ శివప్రసాద్, ఎమ్మెల్యే సుగుణమ్మ, ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రప్రకాష్, టాస్క్‌ఫోర్స్ డీఐజీ కాంతారావు, చీఫ్ కన్జర్వేటర్ ఆఫీసర్ చలపతిరావు, డీఎఫ్‌వో శ్రీనివాసులు, సర్పంచ్ ఈశ్వరమ్మ, ఎంపీపీ స్వాతి, జెడ్పీటీసీ సభ్యురాలు లీలావతి, డీఎస్పీ నంజుండప్ప పాల్గొన్నారు.
Advertisement
Advertisement